ETV Bharat / entertainment

రణ్​బీర్​ పోస్టర్​పై ఆలియా 'హాట్'​ కామెంట్​.. ఆసక్తికరంగా '7 డేస్‌ 6 నైట్స్‌' ట్రైలర్​ - రణ్​బీర్​ కపూర్​

కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్​ 'షంషేరా', ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో రానున్న '7 డేస్‌ 6 నైట్స్‌' చిత్రాల అప్డేట్లు ఇందులో ఉన్నాయి.

shamshera
alia bhatt reacts to shamshera official poster
author img

By

Published : Jun 20, 2022, 4:24 PM IST

బాలీవుడ్​ స్టార్​ రణ్​బీర్ ​కపూర్​ నటిస్తున్న 'షంషేరా' చిత్రం నుంచి అతడి ఫస్ట్​లుక్​ను అధికారికంగా రిలీజ్​ చేసింది నిర్మాణ సంస్థ యశ్​రాజ్​ ఫిల్మ్స్​. కరణ్‌ మల్హోత్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 1800 కాలం నాటి స్వాతంత్య్రకాంక్ష కలిగిన, దోపిడి ముఠా నాయకుడిగా రణ్​బీర్​ కనిపించనున్నాడు. పోస్టర్​లో గుబురుగడ్డం, సూటిగా చూస్తున్న కళ్లు, చేతిలో గొడ్డలితో భీకరంగా ఉన్నాడు రణ్‌బీర్‌. కొద్ది రోజుల కిందే ఈ పోస్టర్​ ఆన్​లైన్​లో లీకై వైరల్​గా మారింది.

Shamshera
'షంషేరా'

జులై 22న తెలుగు, హిందీ, తమిళంలో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్​ కానుంది. ఇందులో వాణీకపూర్​, సంజయ్ దత్​ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 2018లో 'సంజు' సినిమా హిట్‌ తర్వాత రణ్‌బీర్‌ది ఇంతవరకు ఏ చిత్రం విడుదలవ్వలేదు. భార్య ఆలియా భట్​తో కలిసి రణ్​బీర్​ నటించిన 'బ్రహ్మస్త్రం' సెప్టెంబర్​ 9న విడుదలకానుంది. 'షంషేరా'లో రణ్​బీర్​ లుక్​ హాట్​గా ఉందంటూ ఆలియా కామెంట్ చేసింది.

రిలీజ్​ ట్రైలర్​తో సుమంత్ అశ్విన్​: 'ఒక్కడు', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా!', 'వర్షం', 'పౌర్ణమి' వంటి చిత్రాలను నిర్మించి టాలీవుడ్‌లో మంచి విజయాలు అందుకున్న నిర్మాత ఎం.ఎస్‌.రాజు. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన కొత్త చిత్రం '7 డేస్‌ 6 నైట్స్‌'. ఆయన కుమారుడు సుమంత్‌ అశ్విన్‌ హీరోగా ఈ సినిమా సిద్ధమైంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్​ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"దేనికైనా ఓ లెక్కుండాలి అన్నా.. రేపు ఎన్ని గంటలు కొట్టామనే లెక్క ఉండాలి కదా.." అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లో చివరి వరకూ ఆకట్టుకునేలా సాగింది. మెహర్‌ చాహల్‌, రోహన్‌, కృతికా శెట్టి ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. వైల్డ్‌ హనీ ప్రొడెక్షన్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది.

ఇదీ చూడండి: 'శభాష్​ మిథు' ట్రైలర్​ ఆగయా.. మిథాలీగా అదరగొట్టిన తాప్సీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.