బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు దిల్లీ పోలీసులు. సోనమ్ ఇంట్లో పని చేసే నర్సుతో పాటు ఆమె భర్తను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సోనమ్ అత్తకు వైద్య సేవల కోసం అపర్ణ రూత్ విల్సన్ అనే నర్సును కేర్ టేకర్‌గా నియమించారు. ఈ దొంగతనం అమె పనే అని పోలీసులు భావిస్తున్నారు.
విచారణలో భాగంగా మంగళవారం రాత్రి అపర్ణ ఇంట్లో సోదాలు నిర్వహించారు దిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు, స్పెషల్ స్టాఫ్ బ్రాంచ్. అయితే ఇంకా చోరీకి గురైన సొత్తు మాత్రం రివకరీ కాలేదని చెప్పారు పోలీసులు. ఈ క్రమంలో అపర్ణతో పాటు ఆమె భర్త నరేశ్ అరెస్ట్ చేశారు పోలీసులు.
ఫిబ్రవరి 11న సోనమ్ ఇంట్లో చోరీ జరిగింది. ఘటనపై అదే నెల 23న తుగ్లక్ రోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సోనమ్ మేనేజర్. ఈ క్రమంలోనే సోనమ్ ఇంట్లో పనిచేస్తున్న వారందరినీ విచారించారు. ఇదిలా ఉండగా.. మార్చిలో సోనమ్ మామ హరీశ్ అహూజాకు చెందిన షాహీ ఎక్స్ పోర్ట్ కంపెనీకి సైబర్ నేరగాళ్లు రూ.27 కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు. ఆ కేసులు ఫరీదాబాద్ పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి: 'సలార్'కు సీక్వెల్.. ప్రశాంత్ నీల్ ఈ సారి ఏమన్నారంటే?