ETV Bharat / entertainment

​ NBK 109 బిగ్ అనౌన్స్​మెంట్ - 'బాలయ్య' యాక్షన్ షురూ - ఎన్​బీకే 109 సినిమా కథ

NBK109 Shooting : నందమూరి బాలకృష్ణ - దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కుతున్న 'ఎన్​బీకే 109' నుంచి అదిరిపోయే అప్​డేట్ వచ్చింది. సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు చిత్రబృందం ప్రకటించింది.

NBK109 Shooting
NBK109 Shooting
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 11:12 AM IST

Updated : Nov 8, 2023, 4:09 PM IST

NBK 109 Shooting : నందమూరి నట సింహం బాలకృష్ణ - స్టార్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ కెరీర్​లో ఇది 109 వ చిత్రం. దీంతో ఈ సినిమా 'ఎన్​బీకే 109' (NBK) వర్కింగ్ టైటిల్​తో రూపొందనునుంది. సితారా బ్యానర్​పై సూర్యదేవర నాగవంశీ, ఎస్‌.సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే మూవీయూనిట్ తాజాగా బాలయ్య ఫ్యాన్స్​కు అదిరిపోయే అప్​డేట్ ఇచ్చింది.

ఈ సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభమైనట్లు, మూవీయూనిట్ అధికారికంగా తెలిపింది. నిర్మాణ సంస్థ సితారా ఎంటర్​టైన్​మెంట్స్.. 'షూట్ బిగిన్స్​' అంటూ ఓ పోస్టర్​ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్​లో ఓ పదునైన గొడ్డలికి కళ్లద్దాలు జోడించి ఉన్నాయి. వీటితోపాటు అమ్మవారి లాకెట్, ఆయుధానికి వేలాడుతూ ఉన్నట్లు పోస్టర్​లో కనిపిస్తుంది. అలాగే 'లైట్స్ కెమెరా యాక్షన్', 'బ్లడ్ బాత్​ కా బ్రాండ్ నేమ్', 'వైలెన్స్ కా విజిటింగ్ కార్డ్' అంటూ క్యాప్షన్స్​ రాసుకొచ్చారు. ఈ క్యాప్షన్స్​ ప్రేక్షకుల అంచనాలను మరో లెవెల్​కు తీసుకెళ్తున్నాయి.

ఇక ఈ సినిమా ఫుల్ మాస్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్​తో రూపొందన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో.. సరికొత్త లుక్‌తో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. బాలయ్య కోసం ఇప్పటికే బాబీ నాలుగు లుక్​లు డిజైన్​ చేశారని తెలిసింది. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలోకి రావొచ్చని సినివర్గాల్లో టాక్.

త్రివిక్రమ్​తో బాలయ్య.. బాలకృష్ణ పుట్టినరోజే (జూన్ 10) ఈ సినిమా అధికారిక పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఆ కార్యక్రమంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ కథతో త్రివిక్రమ్​కు ఎలాంటి సంబంధం లేదు. కానీ, ఆయన సతీమణీ ​సాయి సౌజన్య ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు. దీంతో త్రివిక్రమ్​ కూడా బాలయ్య సినిమాలో భాగస్వాములయ్యారు.

వైలెన్స్​ కా విజిటింగ్ కార్డ్.. సినిమా అనౌన్స్​మెంట్ సందర్భంగా అప్పుడు కూడా ఓ పోస్టర్​ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఓ సూట్​కేసులో గొడ్డలి, సుత్తి, కత్తి లాంటి మారణాయుధాలను తొలి పోస్టర్​లో చూపించారు. వీటితోపాటు అందులో ఓ 'మ్యాన్షన్ హౌస్' మందు బాటిల్, సిగరెట్లు కూడా కూడా ఉన్నాయి.

NBK 109 : బాక్స్​లో గొడ్డలి, కత్తి, మందు బాటిల్!.. బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

భారీ యాక్షన్​తో ఆ రోజే సెట్స్​పైకి NBK 109 - బాలయ్య పాత్ర ఇలానే ఉండబోతుందట!

Last Updated : Nov 8, 2023, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.