ETV Bharat / entertainment

బాలకృష్ణ సినిమాలో దుల్కర్ సల్మాన్​- ఆ డైరెక్టర్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా! - బాలకృష్ణ బాబీ సినిమా

NBK 109 Dulquer Salmaan : నటసింహ నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్​లో రూపొందుతున్న సినిమా గురించి అప్డేట్​ హల్​చల్ చేస్తోంది. ఎన్​బీకే 109 వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాలీవుడ్​ యంగ్​ నటుడు దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

NBK 109 Dulquer Salmaan
NBK 109 Dulquer Salmaan
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 10:05 PM IST

Updated : Nov 17, 2023, 10:41 PM IST

NBK 109 Dulquer Salmaan : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తతం 'భగవంత్ కేసరి' సక్సెస్​ను ఆస్వాదిస్తున్నారు. దసరా కానుకగా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు మించి దూసుకెళ్లి సక్సెస్​ను అందుకుంది. మరోవైపు క్రమంలో బాలయ్య- స్టార్​ డైరెక్టర్​ బాబీతో కాంబినేషన్​లో మరో సినిమా రూపొందుతోంది. 'ఎన్​బీకే 109' (NBK) వర్కింగ్ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్​ ఇటీవలే ​ ప్రారంభమైంది. అయితే ఈ మూవీపై ఓ అప్డేట్​ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ కోలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్.. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రకటనను చిత్ర యూనిట్ త్వరలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే మాస్​ హీరో బాలకృష్ణ, క్లాస్ హీరోగా పేరున్న దుల్కర్ సల్మాన్ కలిసి వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుందో అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దర్శకుడు బాబీ ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య' సినిమా తెరకెక్కించారు. అందులోనూ మాస్ మహారాజ రవితేజను కీలక పాత్రలో చూపించారు. ఇప్పుడు బాలయ్య విషయంలోనూ అలాగే చేసి.. హిట్​ కొట్టాలని బాబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Unstoppable With NBK Season 3 : అటు వరుస సినిమాల షూటింగ్​లతో బిజీగా ఉన్న బాలయ్య.. ఇటు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమయ్యే 'అన్​స్టాపబుల్​' షో సీజన్​-3తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈ సారి అన్​స్టాపబుల్​ రేంజ్​ బౌండరీలు దాటి బాలీవుడ్​ దాకా వెళ్లింది. అందులో భాగంగా ఈ షోకు గెస్ట్​గా ప్రముఖ బాలీవుడ్​ నటుడు రణ్​బీర్​ కపూర్ వచ్చారు. తాజాగా ఈ ఎపిసోడ్​ షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ మంగళవారం ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది. ఈ క్రమంలో బాలయ్య, రణ్​బీర్​ దిగిన ఓ ఫొటో నెట్టింట్లో వైరల్​గా మారింది. దీంతో రణ్​బీర్​తో బాలయ్య ఏం మాట్లాడారు? ఎలాంటి ప్రశ్నలు అడిగారు? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మిస్​ యూనివర్స్​ 'నేషనల్ కాస్ట్యూమ్ షో'- దేవతలా మెరిసిన శ్వేత శార్దా

అరంగేట్రంలోనే అదుర్స్​ రూ.వందల కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీసు షేక్ చేస్తున్న నటి!

Last Updated : Nov 17, 2023, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.