NBK 107 Movie Update: 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత హీరో బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమా విడుదల ఎప్పుడవుతుందా అని అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ బిగ్ అప్టేట్‌ను రాఖీ పండుగ రోజు ఇవ్వనున్నట్టు సమాచారం.
![హీరో బాలకృష్ణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16010630_teee.jpg)
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతోంది. బాలయ్యను చూడటానికి అభిమానులు పోటెత్తుతున్నారు. షూటింగ్‌కు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండటానికి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుపు రంగులు దుస్తుల్లో బాలకృష్ణ లుక్ ఆకట్టుకునేలా ఉంది.
NBK 107 సినిమాను అఖండ విడుదలైన డిసెంబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ఒకవేళ అది కాకపోతే.. సంక్రాంతి బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మూవీలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్ బాణీలు అందిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: Har Ghar Tiranga Song: ప్రభాస్, కోహ్లీల 'హర్ ఘర్ తిరంగా' సాంగ్.. మనసంతా త్రివర్ణమే!