ETV Bharat / entertainment

భర్త డైరెక్షన్​లో లేడీ సూపర్ స్టార్ మూవీ - మోస్ట్ ఇంపార్టెంట్​ రోల్​లో నయన్​! - నయనతార ప్రదీప్ రంగనాథన్ మూవీ

Nayanthara Vignesh Shivan Movie : లేడీ సూపర్ స్టార్​ నయనతార ప్రస్తుతం కోలీవుడ్​లో బీజీ షెడ్యూల్స్​ గడుపుతోంది. అయితే తాజాగా తన భర్త విఘ్నేశ్ శివన్​ తెరకెక్కించనున్న ఓ సినిమాలో కీ రోల్ ప్లే చేసేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఆ రోల్ ఏంటంటే ?

Nayanthara Vignesh Shivan Movie
Nayanthara Vignesh Shivan Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 10:58 AM IST

Updated : Dec 6, 2023, 11:21 AM IST

Nayanthara Vignesh Shivan Movie : గత రెండు దశాబ్దాలుగా ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ సక్సెస్​ఫుల్​ హీరోయిన్​గా రాణించడం అంటే మాటలు కాదు. ఈ కోవకు చెందిన నటీమణులు అరుదనే చెప్పాలి. అలా తన కెరీర్​ తొలినాళ్ల నుంచి ఇప్పటి వరకు అదే స్టార్​డమ్​ను మెయిన్​టెయిన్​ చేస్తూ సక్సెస్​ఫుల్​గా దూసుకెళ్తోంది తమిళ నటి నయన​తార. తన అందం, అభినయంతో ఇప్పటికీ కుర్రకారులో క్రేజ్ సంపాదించుకుంటోంది. 'జవాన్' సినిమా సక్సెస్​ను ఆస్వాదిస్తున్న ఈ భామ ప్రస్తుతం కోలీవుడ్​లో వరుస ప్రాజెక్టులకు సైన్​ చేస్తూ బిజీ బిజీగా ఉంది. తాజాగా 'అన్నపూరణి' అనే లేడీ ఓరియెంటడ్​ సినిమాలోనూ నటించింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతోంది.

ఇక తన తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఈమె హీరోయిన్​ రోల్స్​ తప్ప ఇంకోటి చేయలేదు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి లీడ్​ రోల్​లో తెరకెక్కిన గాడ్​ ఫాదర్​ సినిమాలో మాత్రం చిరుకు సోదరిగా నటించింది. అయితే తాజాగా ఈ చిన్నది ఓ యంగ్​ హీరోకు అక్క గా నటించనున్నారట. అది తన భర్త విఘ్నేశ్​ శివన్​ డైరెక్షన్​లో తెరకెక్కుతున్న సినిమాలో.

వివరాల్లోకి వెళ్తే.. 'లవ్ టుడే' సినిమాతో సెస్సేషన్​ క్రియేట్ చేసిన డైరెక్టర్ కమ్​ హీరో ప్రదీప్ రంగనాథన్ లీడ్​ రోల్​లో డైరెక్టర్​ విఘ్నేశ్​ శివన్ ఓ సినిమాను ప్లాన్ చేశారట. ఈ సినిమాలో హీరోయిన్​ పాత్ర కోసం బాలీవుడ్​ స్టార్​ జాన్వీ కపూర్ ని ఒప్పించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. ఈ క్రమంలో హీరో అక్క పాత్రలో నయన్​ మెరవనున్నారట. ఈ సినిమాలో ఇదే చాలా కీలకమైన పాత్ర అని టాక్​. అయితే ఈ విషయంపై మూవీ మేకర్స్​ ఇంకా అఫీషియల్ అనౌన్స్​మెంట్​ చేయలేదు.

Nayanathara Annapoorani Movie : తన లేటెస్ట్ మూవీ ప్రమోషన్స్​లో భాగంగా ఇటీవలే ఓ కాలేజీకి వెళ్లిన నయన్​.. అక్కడున్న విద్యార్థినిలను సర్‌ప్రైజ్‌ చేసింది​. చెన్నైలోని ఓ లేడీస్‌ కాలేజ్‌ను సందర్శించిన మూవీ టీమ్​.. లంచ్‌ టైమ్‌కి వెళ్లి వారితో ముచ్చటించి, ఆ తర్వాత బిర్యానీ వడ్డించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇలా తమ అభిమాన తారలను చూడటం పట్ల ఆ స్టూడెంట్స్‌ ఆనందం వ్యక్తం చేశారు.

గజినీతో లైఫ్​ టర్న్​- పేరు మార్చేసిన డైరెక్టర్​- నయన్​ ఫస్ట్​ సినిమా ఏంటో తెలుసా?

20 ఏళ్లైనా తగ్గని నయనతార క్రేజ్​- అగ్ర హీరోయిన్​గా అన్​స్టాపబుల్ జర్నీ!

Last Updated : Dec 6, 2023, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.