ETV Bharat / entertainment

నానికి ఇప్పుడే అసలు సినిమా మొదలైందిగా.. మరి ఏం చేస్తాడో? - nani dasara movie cast

నేచురల్​ స్టార్​ నాని తన లేటెస్ట్ మూవీ 'దసరా'తో బ్లాక్​ బస్టర్​ హిట్​ను అందుకున్నారు. ఈ సినిమాతో ఆయన రేంజ్​ ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఇకపై నాని సినీ కెరీర్​ ఎలా ఉండనున్నదో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆ వివరాలు..

natural star nani
natural star nani
author img

By

Published : Apr 1, 2023, 4:29 PM IST

'దసరా' సినిమా బ్లాక్​ బస్టర్​ హిట్​తో నేచురల్​ స్టార్​ నాని రేంజ్​ మరింత పెరిగింది. ఎప్పుడూ క్లాసీ లుక్​లో కనిపించే ఈ స్టార్​ హీరో ఈ సినిమాలో ఊర మాస్​లుక్​లో దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక తన యాక్టింగ్​తో సినిమాను నెక్ట్స్​ లెవల్​కు తీసుకెళ్లారు. ఈ ఒక్క హిట్​తో మరోసారి తానేంటో నిరూపించారు. అలానే తనలోకి కొత్త కోణాన్ని ప్రేక్షకులకు రుచి చూపించారు.

తన 15 ఏళ్ల కెరీర్​లో ఇప్పటి వరకు టైర్ 2 హీరోగా స్థిరపడ్డ నాని.. ఈ సినిమాతో టైర్​ 1 హీరోలకు దీటుగా నిలిచారు. సినిమా సెట్స్​ పైకి వచ్చినప్పటి నుంచి రిలీజయ్యేంత వరకు.. సినిమాను తన భుజాలపై మోస్తూ.. ఎంతగానో శ్రమించారు. ప్రమోషన్లకు కూడా సోలోగా వెళ్లి అటు నార్త్​లోనూ ఇటు సౌత్​లోనూ సందడి చేశారు. మొత్తానికి తన కష్టానికి తగిన ఫలితం.. ఇప్పుడు వసూళ్ల రూపంలో అందుకుంటున్నారు. ఎప్పుడూ కొత్త దర్శకులతో పని చేసేందుకు ఆసక్తి చూపించే నాని ఈ సారి కూడా నూతన డైరెక్టర్​ శ్రీకాంత్​ ఓదెలతో పని చేసి బాక్సాఫీస్​ ముందు జోరు చూపించారు. రెండు రోజుల్లోనే వరల్డ్​వైడ్​గా రూ.53కోట్ల గ్రాస్​ను అందుకున్నారు. దీంతో నాని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు.

అయితే ఈ హిట్​ తర్వాత నానికి అసలైన పరీక్ష మొదలైందని చెప్పాలి. తన తదుపరి సినిమాలపై మరింత బాధ్యత పెరిగింది. ఇకపై ఆయన కెరీర్​ ఎలా ఉండనుందనే ఆసక్తి సినీ ప్రియుల మెదడులో మొదలైంది. ఇకపై నాని నటించబోయే సినిమాలు ఎలా ఉండనున్నాయి? ఇదే విధంగా ఓపెనింగ్స్ ఉంటాయా? ఇదే ఫామ్​ను కొనసాగిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పటికీ నానిని ఇన్నేళ్లు తక్కువ అంచనా వేసిన వాళ్లకు.. ఈ సినిమాతో ఒక్కసారిగా వాళ్లందరి నోట మాట రానివ్వకుండా చేశారు. ఇన్నేళ్లు నాని చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా నాని కెరీర్​లో ది బెస్ట్​ అనేలా ఉండటం విశేషం. కాబట్టి 'దసరా' తర్వాత నాని నుంచి ఇకపై వచ్చే సినిమాలు కూడా.. ఈ సినిమాను మించి ఉంటేనే నాని కెరీర్​లో మరిన్ని మైల్​ స్టోన్స్​ దాటగలరు. లేదంటే మళ్లీ మీడియం రేంజ్ హీరోగానే కొనసాగాల్సి వస్తుంది​.

నేచురల్​ స్టార్​కు సూపర్​ స్టార్ ప్రశంసలు..
'దసరా' సక్సెస్​, నాని యాక్టింగ్​పై సామాన్యుల నుంచి సెలబ్రిటీలకు అందరూ ప్రశంసిస్తున్నారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కూడా మూవీ టీమ్​పై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. సినిమా చాలా బాగుందని, ఈ విషయానికి తాను ఎంతగానో గర్విస్తున్నానని అన్నారు. ఇక ఈ ట్వీట్​కు రిప్లై ఇస్తూ మహేశ్‌కు ధన్యవాదాలు చెప్పింది చిత్ర నిర్మాణ సంస్థ. అంతే కాకుండా హీరో నాని కూడా మహేశ్​ నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం.. పోకిరి సినిమాకు మణిశర్మ సంగీతం లాగా ఉందని రిప్లై ఇచ్చారు . ప్రస్తుతం ఈ ట్వీట్స్​ సోషల్​ మీడియాలో ట్రెండ్​ అవుతోంది.

కాగా, నాని నటించిన ఫస్ట్​ పాన్‌ ఇండియా మూవీ ఇది. కీర్తి సురేశ్‌ హీరోయిన్​. మార్చి 30న రిలీజ్ అయిన ఈ చిత్రం.. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ మంచి టాక్‌ను తెచ్చుకుంది. ధరణి, వెన్నెలగా నాని-కీర్తిసురేశ్‌ల నటన ఆకట్టుకునేలా ఉందని సోషల్‌మీడియా వేదికగా సినీ ప్రియులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.