ETV Bharat / entertainment

మహేశ్​బాబు-త్రివిక్రమ్​ సినిమాలో నాని.. ఆది 'క్రేజీ ఫెలో' లుక్​ - adi saikumar crazy fellow look

Mahesh babu trivikram movie: మహేశ్​బాబు-త్రివిక్రమ్​ సినిమాలో హీరో నాని నటిస్తారని వార్తలు వస్తున్నాయి. మే 31న ఈ చిత్ర టైటిల్​ను ప్రకటిస్తారట! ఇక యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న 'క్రేజీఫెలో' లుక్​ విడుదలైంది.

Nani in Mahesh trivikram movie
మహేశ్ త్రివిక్రమ్​ సినిమా
author img

By

Published : May 19, 2022, 8:02 PM IST

Mahesh babu trivikram movie: 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో మరో కొత్త సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. మహేశ్‌బాబు 28వ చిత్రంగా ఇది రూపుదిద్దుకోనుంది. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే.. దీన్ని ప్రకటించిన నాటి నుంచి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్ట్​ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. తాజాగా ఈ చిత్రంలో సెకండ్​ హీరోగా ఓ పాత్ర ఉంటుందని, అందులో నేచురల్​ స్టార్​ నాని నటిస్తారని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదుగానీ.. నిజమైతే ఫ్యామిలీ ఆడియెన్స్​కు పండగనే చెప్పాలి. ఇక ఈ సినిమా టైటిల్​ను.. సూపర్ స్టార్​ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న అనౌన్స్ చేస్తారని అంటున్నారు. కాగా, ఇందులో హీరోయిన్​గా పూజాహెగ్డే నటించనుంది.

Hero aadi saikumar crazy fellow look: హీరో ఆది సాయికుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం'క్రేజీ ఫెలో'. ఫణికృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఆదికి జోడీగా దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో ఆది కూల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కెకె రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో షరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా, సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రఫర్‪గా పని చేస్తున్నారు.

crazy first look
క్రేజీ ఫెలో ఫస్ట్​ లుక్​

ఇదీ చూడండి: NTR 30: కత్తి పట్టుకుని మాస్​లుక్​లో ఎన్టీఆర్​.. ఫ్యాన్స్​కు పూనకాలే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.