ETV Bharat / entertainment

నాని ఆశించిన మ్యాజిక్ జరిగిందా?

author img

By

Published : Apr 7, 2023, 10:13 AM IST

నేచురల్ స్టార్ నాని నటించిన దసరా తెలుగలో అనుకన్న దాన్ని కన్నా భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్​ ముందు కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. మరి సౌత్​లోని మిగతా భాషలతో పాటు నార్త్​లో ఈ సినిమా పరిస్థితేంటి?

Natural Star Nani Dasara movie did magic in Pan india level
నాని ఆశించిన మ్యాజిక్ జరగలేదా?

నేచురల్ స్టార్ నాని నటించి 'దసరా' మంచి హిట్​ టాక్​ను తెచ్చుకుంది. బాక్సాఫీస్ ముందు మంచి వసూళ్లను సాధించింది. రూ.100కోట్లకు పైగా కలెక్షన్స్​ను అందుకుంది. అయితే ఈ చిత్రం రిలీజ్​కు చాలా రోజుల ముందే.. ఈ సినిమాను ఉద్దేశిస్తూ నాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. కేజీయఫ్, ఆర్ఆర్ఆర్, పుష్పలతో పోలుస్తూ మాట్లాడారు. 'దసరా' కూడా పాన్​ ఇండియా స్థాయిలో అద్భుతాలు చేస్తుందని అన్నారు. దీంతో నాని మూవీ గురించి ఓవర్​గా మాట్లాడుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఆ తర్వాత పలు మీడియా ఇంటర్వ్యూలో దీని గురించి నానికి ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. సినిమాపై తనకున్న కాన్ఫిడెన్స్‌తోనే ఈ కామెంట్స్ చేశానని నాని వివరణ ఇచ్చారు. దసరాకు అన్ని కలిసొస్తే.. పాన్ ఇండియా లెవెల్​లో అద్భుతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ టాక్​ను తెచ్చుకుంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో బాక్సాఫీస్​ను షేక్​ చేసిందట! ఏపీలో కూడా మంచి ఆడుతోంది.మొత్తంగా అనుకున్నదాని కన్నా ఎక్కువగానే విజయం సాధించింది.

మరి తెలుగేతర భాషల్లో? హిందీలో పరిస్థితి ఏంటి? అనే ఆలోచనలు సినీ ప్రియుల్లో మొదలయ్యాయి. ఈ విషయానికొస్తే.. 'దసరా' చిత్రం అశించిన స్థాయిలో అక్కడ రీచ్​ కాలేకపోయిందని అర్థమవుతోంది! నార్త్​ విషయం పక్కన పెడితే.. దక్షిణాదిలోని ఇతర భాషల్లో పెద్దగా సౌండ్​ చేయలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. తమిళంలో గత వారంలో పత్తు తల, విడుతలై సినిమాలు రిలీజ్​ కావడం మంచి హిట్​ను అందుకోవడం.. దసరాకు గట్టి పోటినిచ్చాయి. ఎక్కువ థియేటర్లు దొరకలేదని తెలిసింది. ఇక మలయాళం, కన్నడలో కూడా ఈ చిత్రం రిలీజైనప్పటికీ అక్కడి వారు ఎక్కువగా మాట్లాడినట్లు కనిపించట్లేదు. సోషల్​మీడియాలో కూడా అక్కడి వసూళ్ల గురించి అంతగా కనపడట్లేదు. ఇక నార్త్​లో పుష్ప రేంజ్​లో హిట్​ను ఆశిస్తే.. పర్వాలేదనిపించినా అది అంత పెద్ద సౌండ్ కాదు. హిందీ వెర్షన్​లో మూడు కోట్లకు పైగా కలెక్షన్స్​ను అందుకున్నట్లు సమాచారం అందింది. వాస్తవనికి మన సినిమాలు అక్కడ ఎక్కువగా రీచ్​ అయితే.. బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు, ప్రముఖ సినీ విశ్లేషకులు కలెక్షన్ల వివరాలను ఎప్పటికప్పుడు ట్వీట్లు చేసి అప్డేట్లు ఇస్తుంటారు. మరి అవి కనపడట్లేదు. కాబట్టి.. నార్త్‌లో కూడా సినిమా అనుకున్నంతగా రేంజ్​లో అంతగా పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తోంది! కేవలం తెలుగు మాత్రం అంచనాలకు మించి.. భారీ స్థాయిలో హిట్​ను అందుకుంది. నాని మార్కెట్​ స్థాయిని బాగా పెంచింది. నాని ఫ్యాన్స్​కు కొత్త ఎక్స్​పీరియన్స్​ను ఇచ్చిందనే చెప్పాలి.

ఇదీ చూడండి: అప్పుడు రామలక్ష్మి ఇప్పుడు​ వెన్నెల.. అడియెన్స్​కు ఫుల్​గా కనెక్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.