ETV Bharat / entertainment

National Film Awards 2021 List : జాతీయ ఉత్తమ చిత్రంగా రాకెట్రీ.. నేషనల్​ అవార్డ్ విన్నర్స్ ఫుల్ లిస్ట్ ఇదే.. - 2021 నేషనల్​ ఫిల్మ్​ అవార్డ్స్​లో ఆర్​ఆర్​ఆర్​

National Film Awards 2021 List : 2021 ఏడాదికి గాను జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో ఉత్తమ సినిమాగా రాకెట్రీ నిలవగా.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా ఆలియా భట్, కృతి సనన్​​ ఎంపికయ్యారు. వీటితో పాటు పలు తెలుగు సినిమాలకు కూడా అవార్డులు దక్కాయి. అవేంటంటే..

National Film Awards 2021
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్​ 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 6:55 PM IST

National Film Awards 2021 : భారతీయ చలనచిత్ర రంగం ఎంతగానో ఎదురుచూసిన 69 ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2021కు గాను సినిమా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నటీనటులు, సాంకేతిక బృందానికి వివిధ కేటగిరీల్లో ఈ అవార్డులు దక్కాయి. 31 విభాగాల్లో ఫీచర్‌ ఫిల్స్మ్‌కు, 24 విభాగాల్లో నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌కు, 3 విభాగాల్లో రచనా విభాగానికి అవార్డులు ప్రకటించారు. 2021 సంవత్సరానికి 281 ఫీచర్‌ ఫిల్మ్‌లు వివిధ విభాగాల్లో ఈసారి జాతీయ అవార్డుల కోసం స్క్రూటినీకి వచ్చినట్లు జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఈ క్రమంలో బెస్ట్​ ఫీచర్​ ఫిల్మ్​ అవార్డును 'రాకెట్రీ ద నంబీ ఎఫెక్ట్​' సినిమా దక్కించుకోగా.. ఉత్తమ నటుడిగా ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​, ఉత్తమ నటిగా ఆలియా భట్​, కృతిసనన్​ ఎంపికయ్యారు.

ఆర్​ఆర్​ఆర్​కు అవార్డుల పంట..
RRR National Fim Awards : మరోవైపు పుష్ప-1తో పాటు 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాకు అవార్డుల వెల్లువ కొనసాగింది. ఉత్తమ మ్యూజిక్​ డైరెక్టర్​(బ్యాక్​గ్రౌండ్ స్కోర్​), ఉత్తమ నేపథ్య గాయకుడు, స్పెషల్​ ఎఫెక్ట్స్​, స్టంట్​ కొరియోగ్రాఫర్​ ఇలా ఆరు కేటగిరీల్లో 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా అవార్డులు అందుకుంది. ఇక ఉత్తమ తెలుగు సినిమాగా 'ఉప్పెన' ఎంపికవ్వగా.. ఉత్తమ హిందీ చిత్రంగా 'సర్దార్‌ ఉద్ధమ్‌', ఉత్తమ గుజరాతీ చిత్రం 'ఛల్లో షో', ఉత్తమ కన్నడ చిత్రంగా '777 చార్లీ', ఉత్తమ మలయాళీ చిత్రంగా 'హోమ్‌' సినిమాలకు అవార్డులు ప్రకటించారు. 'కొండపొలం' సినిమాకు పాటలు రాసిన చంద్రబోస్‌కు ఉత్తమ గీత రచయిత పురస్కారానికి ఎంపికయ్యారు.

Pushpa 1 National Awards List :

  • జాతీయ ఉత్తమ నటుడు - అల్లు అర్జున్‌ (పుష్ప-1)
  • ఉత్తమ సంగీత దర్శకుడు - దేవిశ్రీ ప్రసాద్‌ (పుష్ప-1)

RRR National Awards List :

  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌ - ప్రేమ్‌ రక్షిత్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • ఉత్తమ పాపులర్‌ ఫిల్మ్‌ - ఆర్‌ఆర్‌ఆర్‌
  • ఉత్తమ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ - కింగ్‌ సోలోమన్ (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ - శ్రీనివాస్‌ మోహన్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ - ఎంఎం కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు - కాల భైరవ (ఆర్‌ఆర్‌ఆర్‌)

ఇక ఇవే కాకుండా పలు సినిమాలు, స్టార్స్​ ఈ అవార్డులు అందుకున్నారు. వారెవరంటే..

  • ఉత్తమ తమిళ చిత్రం - కడసాయి వ్యవసాయి
  • నాన్‌ ఫీచర్‌ విభాగంలో ఉత్తమ చిత్రం- ఏక్‌ థా గావ్‌ ( హిందీ)
  • ఉత్తమ గుజరాతీ చిత్రం - చెల్లో షో
  • ఉత్తమ కన్నడ చిత్రం - 777 చార్లీ
  • ఉత్తమ మరాఠీ చిత్రం - ఏక్దా కాయ్‌ జాలా
  • ఉత్తమ మలయాళ చిత్రం - హోమ్‌
  • ఉత్తమ ఒడిశా చిత్రం - ప్రతిక్ష్య
  • ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం - కశ్మీర్‌ ఫైల్స్‌
  • ఉత్తమ నేపథ్య గాయని - శ్రేయ ఘోషల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.