ETV Bharat / entertainment

మరోసారి లవర్​బాయ్​గా చైతూ అదుర్స్​.. అగ్ర హీరోలతో సమంత ఢీ - సమంత

కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న 'థ్యాంక్‌ యూ', కిరణ్‌ అబ్బవరం 'సమ్మతమే', సమంత 'యశోద' చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

samantha
naga chaitanya
author img

By

Published : Jun 16, 2022, 5:53 PM IST

అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'థ్యాంక్‌ యూ'. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విభిన్న ప్రేమకథగా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా నుంచి 'ఏంటో ఏంటో' అనే మెలడీ లిరికల్ సాంగ్ విడుదలైంది. పాటలో లవర్​బాయ్​ లుక్స్​తో మరోసారి ఆకట్టుకుంటున్నారు చైతూ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ చైతన్య మూడు భిన్నమైన లుక్స్‌తో కనిపించనున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అవికాగోర్‌,మాళవిక నాయర్‌ కథానాయికలు. తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాకు పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహకుడుగా పనిచేస్తున్నారు. జులై 8న చిత్రం థియేటర్లలో విడుదలకానుంది.

కిరణ్‌-చాందిని 'సమ్మతమే' ట్రైలర్‌: కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం 'సమ్మతమే'. చాందినీ చౌదరి కథానాయిక. యు. జి. ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన చిత్ర బృందం ఇందులో భాగంగానే తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో గురువారం ట్రైలర్‌ను విడుదల చేయించింది. కంకణాల ప్రవీణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి శేఖర్‌ చంద్ర సంగీతం అందించారు.

ఆమిర్​తో అక్షయ్ ఢీ.. బరిలోనే సామ్​ కూడా: బాక్సాఫీస్ వేదికగా మిస్టర్ పర్​ఫెక్ట్​ ఆమిర్ ఖాన్​ను ఢీకొనబోతున్నారు అక్షయ్ కుమార్. అన్నా చెల్లెల్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన 'రక్షా బంధన్' అనే సినిమాను రాఖీ సందర్భంగా ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆమిర్ నటించిన 'లాల్ సింగ్ చద్ధా' కూడా అదే రోజున విడుదలకానుంది. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఎవరు పైచేయి సాధిస్తారనేది వేచిచూడాలి.

akshay kumar aamir khan movie
'రక్షా బంధన్'- 'లాల్ సింగ్ చద్ధా'

1994లో విడుదలైన 'ఫారెస్ట్​ గంప్​' అనే హాలీవుడ్​ సినిమాకు హిందీ రీమేక్​గా 'లాల్​ సింగ్ చద్ధా' తెరకెక్కింది. ఇందులో ఆమిర్​ఖాన్​ సరసన కరీనా కపూర్​ నాయికగా నటించింది. నాగచైతన్య కీలక పాత్రలో మెరిశారు. ఈ చిత్రానికి అద్వైత్​ చందన్​ దర్శకత్వం వహించారు. ఇక అగ్రతార సమంత నటించిన 'యశోద' కూడా ఈ రెండు సినిమాలతో పోటీలో ఉంది. 'యశోద' ఆగస్టు 12న విడుదలకానుంది.

samantha
సమంత

ఇదీ చూడండి: అవకాశం వస్తే ఆ పాత్ర చేయడానికైనా సిద్ధమే: రాశీఖన్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.