ETV Bharat / entertainment

'ఆదిపురుష్'​ నుంచి అదిరిపోయే అప్​డేట్​​.. టీజర్ అప్పుడే - ప్రభాస్​ సినిమా ఆదిపురుష్​

Adipurush New Update : ప్రముఖ నటుడు ప్రభాస్​ నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాాగా ఈ సినిమా గురించి మరో అప్​డేట్ వచ్చింది. అదేంటంటే..

adipurush new update
adipurush new update
author img

By

Published : Sep 30, 2022, 7:24 AM IST

Updated : Sep 30, 2022, 1:35 PM IST

Adipurush New Update : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రెబల్​ స్టార్​ ప్రభాస్​ నటిస్తున్న పాన్​ ఇండియా సినిమా 'ఆదిపురుష్'. ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్ ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా భారీ అంచనాలే ఉన్నాయి. అప్పుడప్పుడు అప్​డేట్లు వదులుతూ.. ప్రేక్షకుల నోళ్లల్లో సినిమా నానేలా చేస్తోంది చిత్ర యూనిట్. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఫ్యాన్ మేడ్​ పోస్టర్లు క్రియేట్​ చేస్తున్నారు. ఇవి అధికారిక పోస్టర్లకు ఏమాత్రం తీసిపోవడం లేదు. సినిమా గురించి గాసిప్​లతో ఇన్​బాక్స్​లు నిండిపోతున్నాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా మరో అప్​డేట్​ వచ్చింది.

adipurush new update
ఆదిపురుష్ పోస్టర్

అయోధ్యలోని సరయు నది ఒడ్డున 'ఆదిపురుష్​' సినిమా పోస్టర్​, టీజర్​ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు సినిమా దర్శకుడు ఓం రౌత్​ ట్విట్టర్​ వేదికగా ప్రకటించారు. అక్టోబర్​ 2 సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకు ఈ సినిమా టీజర్​ను​ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాను 2023 జనవరి 12న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఇవీ చదవండి: బ్రహ్మాస్త్ర సీక్వెల్స్​పై అదిరిపోయే అప్డేట్స్​.. ఏంటంటే?

వామ్మో.. ఈ ముద్దుగుమ్మలు ధరించిన డ్రెస్​ రూ.లక్షా?.. ఎందుకంత స్పెషలో?

Last Updated : Sep 30, 2022, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.