Cannes film festival 2022: 75 వసంతాల వేళ.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భారతీయ సెలబ్రిటీలు మెరవబోతున్నారు. దేశంలోని సుప్రసిద్ధ తారలు రెడ్ కార్పెట్‌పై తళుక్కుమనేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 17వ తేదీన ఫెస్టివల్లో కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా.. పలవురు నటీనటులు, సంగీత దర్శకులకు రెడ్ కార్పెట్‌పై నడిచే అవకాశం దక్కింది. హాజరయ్యే వారికి ఇప్పటికే ఆహ్వానాలు కూడా అందాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో పాటు కేటగిరీల వారీగా.. ఫెస్టివల్‌కు ఆహ్వానం లభించింది. ఆహ్వానితుల జాబితా ఇలా ఉంది..
- అక్షయ్ కుమార్( నటుడు, నిర్మాత- బాలీవుడ్)
- ఏఆర్ రెహమాన్ ( అంతర్జాతీయ మ్యూజిక్ కంపోజర్)
- మామే ఖాన్ ( ఫోక్ మ్యూజిక్ కంపోజర్, సింగర్)
- నవాజుద్దీన్ సిద్ధిఖీ ( నటుడు, బాలీవుడ్)
- నయనతార ( తమిళం, మలయాళం- హీరోయిన్)
- పూజా హెగ్డే ( హిందీ, తెలుగు- హీరోయిన్)
- ప్రసూన్ జోషీ( ఛైర్మన్, సీబీఎఫ్సీ)
- మాధవన్( నటుడు, నిర్మాత).. మాధవన్ నటించిన 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్' సినిమాను కేన్స్ వేదికపై ప్రదర్శించనున్నారు.
- రిక్కీ కేజ్ ( మ్యూజిక్ కంపోజర్ )
- శేఖర్ కపూర్ ( దర్శకుడు)
- తమన్నా( తెలుగు, హిందీ, తమిళం- హీరోయిన్)
ఇదీ చదవండి: 'సలార్ అప్డేట్ ఎప్పుడు?' సూసైడ్ నోట్లో ప్రభాస్ అభిమాని!