ETV Bharat / entertainment

'వారికి మాత్రమే 'మా' సభ్యత్వం'.. మంచు విష్ణు సంచలన ప్రకటన

author img

By

Published : Oct 13, 2022, 9:23 PM IST

Updated : Oct 13, 2022, 10:48 PM IST

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​ సభ్యత్వంపై 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. 'మా'లో నటులు కాని సభ్యులు 20శాతం మంది ఉన్నారని తెలిపారు.

maa MANCHU VISHNU PRESS MEET
MANCHU VISHNU PRESS MEET

'మా' ఎన్నికల్లో ఇచ్చిన 90శాతం వాగ్దానాలు పూర్తయ్యాయని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. మా అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "'మా'లో 20 శాతం మంది నటులు కాని సభ్యులున్నారు. రెండు సినిమాల్లో నటించి విడుదలైతేనే శాశ్వత సభ్యత్వం ఇస్తాం. 5 నిమిషాలైనా సినిమాలో డైలాగు చెప్పిన వాళ్లకే అసోసియేట్‌ సభ్యత్వం. అసోసియేట్‌ సభ్యులకు 'మా'లో ఓటు హక్కు లేదు" అని విష్ణు తెలిపారు.

"2021 అక్టోబరు 13న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడిగా నేను బాధ్యత తీసుకున్నా. ఆ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించేలా పోటాపోటీగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆసక్తి చూపారు. నేను 'మా'కు మాత్రమే కాదు ప్రేక్షకులకూ జవాబుదారిని. మేం చేసిన వాగ్దానాల్లో 90శాతం పూర్తయ్యాయి. 'మా'లో నటులుకాని సభ్యులూ ఉన్నారు. సభ్యత్వం విషయంలో కఠినంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నాం. నటీనటులు రెండు సినిమాల్లో నటించి, ఆ చిత్రాలు విడుదలైతేనే శాశ్వత సభ్యత్వం ఇస్తాం. క్యారక్టర్‌ ఆర్టిస్టులు కనీసం పది సినిమాల్లోనైనా నటించి ఉండాలి. ఐదు నిమిషాలైనా సినిమాలో కనిపించాలి. అసోసియేట్‌ సభ్యులకు 'మా'లో ఓటు హక్కు లేదు. సభ్యత్వం ఉన్నవారే సినిమాల్లో నటింపజేయాలని నిర్మాతలకు చెప్పాం. నిర్మాత మండలి.. 'మా' సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. 'మా'కు వ్యతిరేకంగా నటులు, కార్యవర్గ సభ్యులు ధర్నాలు చేసినా, సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టినా వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం. ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే 'మా' ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. 'మా' భవనానికి రెండు ప్రతిపాదనలు సూచించా. ఫిల్మ్‌నగర్‌ సమీపంలో ఓ భవనం నిర్మిస్తున్నాం. ప్రస్తుతమున్న ఫిల్మ్‌ ఛాంబర్‌ భవనాన్ని కూల్చి కొత్త భవనం కట్టేందుకు నేను ఖర్చు భరిస్తా. చాలామంది సభ్యులు రెండోదానికే ఆమోదం తెలిపారు"

"నటులందరికీ అవకాశం కల్పించాలనే అంశంపై ఓ పుస్తకాన్ని రూపొందించాం. దాన్ని ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌తోపాటు నిర్మాతలందరికీ ఇచ్చాం. దీని ద్వారా ఇప్పటికే పది మందికి అవకాశాలు వచ్చాయి. మొబైల్‌ యాప్‌ పనులు జరుగుతున్నాయి. సంక్రాంతి తర్వాత అందుబాటులోకి తీసుకొస్తాం. ఆ యాప్‌తో ఏ నిర్మాణ సంస్థలో ఏ చిత్రం తెరకెక్కబోతుంది? ఏ సినిమా చర్చల దశలో ఉంది? తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చు. భారత చలన చిత్ర పరిశ్రమలోని ఏ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లోనూ ఇలాంటి విధానం లేదు. తొలిసారి ఇక్కడ ప్రారంభిస్తున్నాం. 'మా'.. మహిళలకు ఎప్పుడూ అండగా ఉంటుంది. పద్మశ్రీ సునీత కృష్ణన్‌ గారిని అడ్వయిజర్‌గా ఓ కమిటీని ఏర్పాటు చేశాం. 'మా' శాశ్వత సభ్యత్వం ఉన్నవారికే ఆరోగ్య బీమా. 'మా' సభ్యులు కాని సుమారు ఆరుగురికి పింఛను రద్దు చేశాం. వారిలో ఓ నటుడి కూతురు ఉంది. ఆ నటుడు చనిపోయిన తర్వాత ఆయన పింఛను ఆమెకు వస్తుండటంతో 'మా' తరఫున క్యాన్సిల్‌ చేసి, నేను వ్యక్తిగతంగా ఇస్తున్నా. 60 ఏళ్లు దాటినవారు, ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్న వారికే పెన్షన్‌ ఇస్తున్నాం" అని మంచు విష్ణు తెలిపారు.

అది డబ్బా కొట్టుకోవడం కాదు: మోహన్ బాబు
మరోవైపు, తన తనయుడు మంచు విష్ణు చేసే పనుల్లో మోసం, దగా లేవని అన్నారు మోహన్‌బాబు. చేసిన పనుల గురించి చెప్పటం మంచిదని, సొంత డబ్బా కొట్టుకోవటం కాదని వ్యాఖ్యానించారు. విష్ణు అధ్యక్షుడిగా మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. "మా' ఎన్నికల్లో విష్ణు ఓడిపోవాలని కోరుకున్నవారూ బాగుండాలి. నేను 'మా' అధ్యక్షుడిగా పనిచేసినప్పుడూ ఎలాంటి మీటింగ్‌లు పెట్టలేదు. చేసిన పనుల గురించి తెలియజేయటం మంచి పని. సొంత డబ్బా కొట్టుకోవటం కాదు. 'మా' సభ్యులందరికీ శిరిడీ సాయి ఆశీస్సులుండాలి. అందరూ ఐక్యంగా ఉండండి. విష్ణు చేసే పనుల్లో దగా లేదు, మోసం లేదు" అని మోహన్‌బాబు చెప్పారు.

Last Updated : Oct 13, 2022, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.