ETV Bharat / entertainment

గుడ్డూ భయ్యా ఎమోషనల్‌ పోస్ట్​.. 'మీర్జాపూర్‌ 3' అప్డేట్​.. దాన్ని మీరు నమ్మకపోవచ్చంటూ.. - mirzapu pankaj tripathi

'మీర్జాపూర్‌' వెబ్‌ సిరీస్‌ నటుడు అలీ ఫజల్‌ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. మీర్జాపూర్​ 3 గురించి కూడా ఓ అప్డేట్​​ ఇచ్చారు. ఇంతకీ ఏమని పోస్ట్​ పెట్టారంటే..

mirzapur season 3 update
mirzapur season 3 update
author img

By

Published : Dec 5, 2022, 7:15 PM IST

క్రైమ్‌, థ్రిల్లర్‌ యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ 'మీర్జాపూర్'. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు హిట్‌ అందుకోవడంతో మూడో సీజన్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానిపై ఓ అప్డేట్ వచ్చింది. 'మీర్జాపూర్‌ 3' చిత్రీకరణ పూర్తయినట్టు నటుడు అలీ ఫజల్‌ (గుడ్డూ భయ్యా) సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. సెట్లో తీసుకున్న సెల్ఫీ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. టీమ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

mirzapur season 3 update
గుడ్డూ భయ్యా అలియాస్​ అలీ ఫైజల్​

"మీర్జాపూర్' ప్రపంచాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన నా టీమ్‌కు ధన్యవాదాలు. గత రెండు సీజన్లతో పోలిస్తే సీజన్‌ 3 నాకు ప్రత్యేకమైంది. ఇదొక విభిన్న ప్రయాణం. ఈ సిరీస్‌కు పనిచేసిన ప్రతి ఒక్కరి నుంచీ నేను చాలా నేర్చుకొన్నా. దాన్ని మీరు నమ్మకపోవచ్చు. మీరంతా నాకు సాయం చేశారు. దాన్ని నేను రాతల్లో తెలపలేను. 'మీర్జాపూర్‌' బృందం దీన్ని చదువుతుందని ఆశిస్తున్నా. వ్యక్తిగతంగా లేఖలు రాయలేకపోయినందుకు క్షమించండి" అని అలీ తన పోస్ట్‌లో రాశారు. సిరీస్‌ దర్శకుడు గుర్మీత్‌ సింగ్‌, సిరీస్‌ స్ట్రీమింగ్‌ అయ్యే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ 'అమెజాన్‌'కు కృతజ్ఞతలు తెలిపారు. నటి శ్వేతా త్రిపాఠి సైతం 'మీర్జాపూర్‌' షూటింగ్‌ పూర్తయిందని తెలియజేస్తూ.. అందులోని పాత్ర తనకు సవాలు విసిరిందన్నారు.

mirzapur season 3 update
మీర్జాపూర్‌ సీజన్ 3

ఉత్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ తొలి సీజన్‌ 2018 నవంబరు 16న విడుదలైంది. పంకజ్‌ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్‌, శ్రియ పిల్గోంగర్‌, హర్షిత గౌర్‌ తదితరులు నటించిన ఫస్ట్‌ సీజన్‌కు మంచి స్పందన లభించింది. దానికి కొనసాగింపుగా 2020 అక్టోబరు 23న రెండో సీజన్‌ విడుదలైంది. మూడో సీజన్‌ వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. ఈ సిరీసే కాదు గుడ్డూ భయ్యాగా అలీ ఫజల్‌ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

mirzapur season 3 update
మీర్జాపూర్‌ సీజన్ 3

ఇవీ చదవండి : ఈ ఏడాది TOP​ 10 మ్యూజిక్​ ఆల్బమ్స్​ ఇవే

మరో సినిమాకు మాస్​ మహారాజా గ్రీన్​ సిగ్నల్​!.. హిట్​ ఇచ్చిన డైరెక్టర్​తోనే!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.