Mega 154 : బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ప్రకటించిన నాటి నుంచి ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాను 'మెగా 154'గా పిలుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు మెగా అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో చిరు మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మాస్ ఎంటర్ టైనర్‌గా రానున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. చిత్ర బృందం ఈ సన్నివేశాలు తెరకెక్కించడం పై దృష్టి పెట్టినట్లు సమాచారం. రవితేజ దీనిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా ఈ చిత్రాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. దీనిలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికి బరిలో దిగనున్న ఈ చిత్రానికి ఎన్బీకే 'వీరసింహారెడ్డి', ప్రభాస్ 'ఆదిపురుష్'తో పోటీ పడాల్సి ఉంటుంది.
-
Diwali begins with a MASS EXPLOSION 💥#Mega154 Title Teaser Tomorrow at 11.07 AM ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) October 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Let's welcome the 'MASS MOOLAVIRAT' 🔥
Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @shrutihaasan @dirbobby @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/rjgYlVcgRH
">Diwali begins with a MASS EXPLOSION 💥#Mega154 Title Teaser Tomorrow at 11.07 AM ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) October 23, 2022
Let's welcome the 'MASS MOOLAVIRAT' 🔥
Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @shrutihaasan @dirbobby @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/rjgYlVcgRHDiwali begins with a MASS EXPLOSION 💥#Mega154 Title Teaser Tomorrow at 11.07 AM ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) October 23, 2022
Let's welcome the 'MASS MOOLAVIRAT' 🔥
Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @shrutihaasan @dirbobby @ThisIsDSP @konavenkat99 @SonyMusicSouth pic.twitter.com/rjgYlVcgRH
ఇదీ చదవండి: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. మూవీ టీమ్స్ నుంచి రెండు సర్ప్రైజ్లు