Ram Charan Baby : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు మిన్నంటాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం తెల్లవారు జామున జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు అపోలో ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. చరణ్- ఉపాసనలకు 2012లో వివాహమైంది. వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్టు గతేడాది డిసెంబరు 12న ఇరు కుటుంబాలు వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు.
'మెగా ప్రిన్సెస్'కు వెలకమ్ చెప్పిన తాతయ్య!
Chiranjeevi Tweet : మెగా ఫ్యాన్స్‌కు రామ్‌చరణ్ తీపికబురు అందించిన వేళ తాతయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు. రాత్రంతా ఆస్పత్రిలోనే ఆ చిన్నారితో గడిపారట. ఇక ట్విట్టర్ వేదికగా తన మనవరాలికి వెలకమ్ చెప్పిన మెగాస్టార్.. 'లిటిల్ మెగా ప్రిన్సెస్'కు స్వాగతం అంటూ ట్వీట్ చేశారు. "నీ రాకతో లక్షలాది మందితో కూడిన మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపావు" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీన్ని చూసిన అభిమానులు మెగా ఫ్యామిలీకి కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
-
Welcome Little Mega Princess !! ❤️❤️❤️
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
You have spread cheer among the
Mega Family of millions on your arrival as much as you have made the blessed parents @AlwaysRamCharan & @upasanakonidela and us grandparents, Happy and Proud!! 🤗😍
">Welcome Little Mega Princess !! ❤️❤️❤️
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2023
You have spread cheer among the
Mega Family of millions on your arrival as much as you have made the blessed parents @AlwaysRamCharan & @upasanakonidela and us grandparents, Happy and Proud!! 🤗😍Welcome Little Mega Princess !! ❤️❤️❤️
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2023
You have spread cheer among the
Mega Family of millions on your arrival as much as you have made the blessed parents @AlwaysRamCharan & @upasanakonidela and us grandparents, Happy and Proud!! 🤗😍
'అత్త మామాలతోనే'
సాధారణంగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెడుతుంటారని, తాము దానికి పూర్తి భిన్నమని ఉపాసన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను, చరణ్.. అత్తమామలతో కాకుండా విడిగా ఉంటున్నామని, బిడ్డ పుట్టిన తర్వాత అత్తమామల (చిరంజీవి- సురేఖ)తోనే ఉండాలని నిర్ణయించుకున్నామని ఉపాసన తెలిపారు. తమ ఎదుగుదలలో గ్రాండ్ పేరెంట్స్ కీలక పాత్ర పోషించారని, వారితో ఉంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలనుకోవాలని లేదని చెప్పారు.
పాపాయి కోసం.. కాలభైరవ స్పెషల్ ట్యూన్!
ఉపాసన, రామ్ చరణ్ దంపతుల బిడ్డ కోసం టాలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, కాల భైరవ ఓ అద్భుతమైన ట్యూన్‌ను గిఫ్ట్‌గా అందించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రామ్ చరణ్ దంపతులు.. ఈ ట్యూన్ విని చిన్నారులు ఆనందంలో మునిగిపోయేలా ఉన్నారంటూ కాల భైరవకు కితాబులిచ్చారు.
"ఈ ట్యూన్‌ను మా కోసం ప్రత్యేకంగా తయారు చేసినందుకు థ్యాంక్యూ కాల భైరవ. ఈ భూమ్మీద ఉన్న లక్షల మంది చిన్నారుల్లో ఈ మెలోడి ట్యూన్ సంతోషాన్ని తీసుకొస్తుందని నమ్ముతున్నాం." అంటూ రామ్ చరణ్ దంపతులు ట్వీట్ చేశారు.
-
Thank you @kaalabhairava7, for creating this tune for us. We are sure this melody will bring happiness and joy to millions of children across the globe.. pic.twitter.com/911bGK4GZz
— Ram Charan (@AlwaysRamCharan) June 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Thank you @kaalabhairava7, for creating this tune for us. We are sure this melody will bring happiness and joy to millions of children across the globe.. pic.twitter.com/911bGK4GZz
— Ram Charan (@AlwaysRamCharan) June 19, 2023Thank you @kaalabhairava7, for creating this tune for us. We are sure this melody will bring happiness and joy to millions of children across the globe.. pic.twitter.com/911bGK4GZz
— Ram Charan (@AlwaysRamCharan) June 19, 2023
ఇక బిడ్డ పుట్టక ముందు నుంచే మెగా ఇంటికి బహుమతుల వెల్లువ మొదలైంది. ఇటీవలే ఉపాసన సోషల్ మీడియాలో తమ చిన్నారి కోసం చేయించిన ఓ ఊయల గురించి ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు. తమకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రజ్వలా ఫౌండేషన్ ఓ ప్రత్యేకమైన ఊయలను కానుకగా ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. ఊయల ప్రాముఖ్యతతో పాటు దాన్ని తయారుచేసిన విధానాన్ని వివరించారు.సెక్స్ ట్రాఫికింగ్‌లో చిక్కుకుని బయటపడిన మహిళలకు.. ప్రజ్వల ఫౌండేషన్ ఉపాధితో పాటు ఆశ్రయం కల్పిస్తోందని.. వారిలోని కొందరు మహిళలే ఈ ఊయలను తయారు చేశారని ఉపాసన తెలిపారు.
-
We are honoured & humbled to receive this heartfelt gift from the incredible young women of #PrajwalaFoundation.
— Upasana Konidela (@upasanakonidela) June 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
This handcrafted cradle holds immense significance, symbolizing strength, resilience & hope.
It represents a journey of transformation and self-respect that I want… pic.twitter.com/njRU4SfnaO
">We are honoured & humbled to receive this heartfelt gift from the incredible young women of #PrajwalaFoundation.
— Upasana Konidela (@upasanakonidela) June 17, 2023
This handcrafted cradle holds immense significance, symbolizing strength, resilience & hope.
It represents a journey of transformation and self-respect that I want… pic.twitter.com/njRU4SfnaOWe are honoured & humbled to receive this heartfelt gift from the incredible young women of #PrajwalaFoundation.
— Upasana Konidela (@upasanakonidela) June 17, 2023
This handcrafted cradle holds immense significance, symbolizing strength, resilience & hope.
It represents a journey of transformation and self-respect that I want… pic.twitter.com/njRU4SfnaO
Ram Charan Movies : ఇక రామచరణ్ సినిమాల విషయానికి వస్తే.. గత కొద్ది రోజుల నుంచి రామ్ చరణ్ షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చారని.. కొద్ది రోజుల పాటు తన పాపాయితో గడపాలని ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకురాన్ని పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటి నుంచి ఆగస్ట్ వరకు రామ్ చరణ్ సినిమా షూటింగ్స్ లో పాల్గొనరని సినీ వర్గాల టాక్. ఇక రామ్‌చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో కలిసి 'ఆర్సీ 16' అనే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శంకర్‌తో సినిమా పూర్తి కాగానే ఈ కొత్త చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో ఉన్నట్లు టాక్.