ETV Bharat / entertainment

Manchu Vishnu Kannapa Movie : మా ప్రెసిడెంట్ డ్రీమ్ ప్రాజెక్ట్​లో ట్విస్ట్​ .. 'కన్నప్ప' నుంచి ఆ స్టార్ ఔట్! - మంచు విష్ణు కన్నప్ప సినిమా ప్రొడ్యూసర్

Manchu Vishnu Kannapa Movie : టాలీవుడ్ స్టార్ హీరో, మా ప్రెసిడెంట్​ మంచు విష్ణు డ్రీమ్​ ప్రాజెక్ట్ సినిమా 'కన్నప్ప'. ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్​డేట్ వచ్చింది.

Manchu Vishnu Kannapa Movie
Manchu Vishnu Kannapa Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 10:32 PM IST

Manchu Vishnu Kannapa Movie : టాలీవుడ్ స్టార్ హీరో, మా ప్రెసిడెంట్​ మంచు విష్ణు డ్రీమ్​ ప్రాజెక్ట్ సినిమా 'కన్నప్ప'. డైరెక్టర్ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రీసెంట్​గా శ్రీకాళహస్తిలో గ్రాండ్​గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ కీలక అప్​డేట్ వచ్చింది అదేంటంటే..

ఈ సినిమాలో నటి నుపుర్ సనన్​ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకున్నారు. ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు స్వయంగా ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. " డేట్స్‌ అడ్జెస్ట్​మెంట్ విషయంలో సమస్యలు తలెత్తాయి. దీంతో నటి నుపుర్‌ సనన్‌ ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగారని తెలుపడం బాధగా ఉంది. నపుర్​ను మా టీమ్ చాలా మిస్ అవుతుంది. ఇక ఈ ప్రాజెక్ట్​ కోసం మరో నటీమణిని వెతికె ప్రాసెస్ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రస్తుతం నుపుర్ చేస్తున్న ఇతర ప్రాజెక్టులు అన్నీ కూడా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలోనే ఆమెతో కలిసి పనిచేసే ఛాన్స్ వస్తుందని ఆశిస్తున్నా. ఇక సినిమా గురించి మరిన్ని అప్​డేట్స్​ కోసం వేచి చూడండి" అంటూ ఆయన ట్విట్టర్​లో రాసుకొచ్చారు.

ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్తకన్నప్ప చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో శివుడి పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్నారని, ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఇక చిత్రానికి స్టీఫెన్‌ దేవాసి, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్​తో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్​పై పాన్​ ఇండియా లెవెల్​లో నిర్మిస్తున్నారు.

Nupur Sanon Movies : ఇక నటి నుపుర్ సనన్.. బాలీవుడ్ బ్యూటీ నటి కృతిసనన్‌ సోదరిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తెలుగులో ఆమె ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ 'టైగర్‌ నాగేశ్వరరావు' సినిమాలో నటిస్తున్నారు. అటు బాలీవుడ్​లోనూ ఆమె నవాజుద్దీన్‌ సిద్ధిఖీతో ఓ సినిమాలో నటిస్తున్నారు.

  • Sad to announce that lovely @NupurSanon had to step down from #Kannappa due to scheduling conflicts. We'll miss her, but the hunt for our new leading lady begins! Sending Nupur our best wishes on her other commitments. Hope to work with her in the near future

    Exciting times…

    — Vishnu Manchu (@iVishnuManchu) September 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Prabhas Kannappa Movie : 'కన్నప్ప' సినిమాలో ప్రభాస్‌ రోల్​.. నెట్టింట విష్ణు హింట్​..

రూ.100 కోట్ల బడ్జెట్ సినిమా ప్రకటించిన మోహన్​ బాబు.. వర్కౌట్ అవుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.