సినీ ఇండస్ట్రీలో మరో విషాదం జరిగింది. ప్రముఖ మలయాళ సీరియల్ నటి సుబీ సురేశ్ చిన్న వయసులోనే మృతి చెందారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు తుదిశ్వాస విడిచారు. సుబీ సురేశ్ మృతి పట్ల సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.
గత నెల 28వ తేదీన సుబీ సురేశ్ హాస్పిటల్లో చేరారు. అయితే అక్కడ ఆమెకు కాలేయ సంబంధిత వ్యాధి కూడా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అప్పటికే ఆ వ్యాధి తీవ్రత పెరిగిపోయింది. దీంతో ఆమెకు కాలేయ మార్పిడి చేసేందుకు వైద్యులు ప్రయత్నించారు. వారికి కాలేయ దాత కూడా లభించాడు. అయితే లివర్ ట్రాన్స్ప్లంటేషన్ చేసి ఆమెను బతికించాలనుకున్న ప్రయత్నం విఫలమైంది. మంగళవారం ఆమె పరిస్థితి విషమంగా మారడం వల్ల ఆమెను వెంటిలేటర్లో ఉంచారు. చికిత్స పొందుతూ బుధవారం హాస్పిటల్లోనే తుదిశ్వాస విడిచారు.
సుబీ సురేశ్ యాంకర్, సీరియల్ నటిగా మంచి గుర్తింపు పొందారు. ఆమె యాంకరింగ్‌కు మలయాళంలో విపరీతమైన క్రేజ్ ఉంది. డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సుబి.. పలు షోలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. హ్యాపీ హస్బెండ్స్, తస్కరా లహలా, డ్రామా, గృహనాథన్ వంటి చిత్రాల్లో నటించారు. అనే సీరియళ్లలో నటించి మెప్పించారు.