Mahesh babu Workout Pics : సూపర్ స్టార్ మహేశ్ ప్రస్తుతం 'గుంటూరు కారం' సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే వెకేషన్‌కు వెళ్లిన ఆయన..మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టారు. నాలుగు పదుల వయసులోనూ యంగ్‌గా కనిపించే ఆయన.. తన పర్సనల్ లైఫ్‌తో పాటు కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తుంటారు. క్రమం తప్పకుండా డైట్ ఫాలో అవుతూ ఫిటనెస్ మెయిన్టేయిన్ చేస్తున్నారు. ఎక్కడున్నా సరే జిమ్‌కు తప్పకుండా వెళ్తుంటారు.ఈ క్రమంలో ఇటీవలే ఆయన జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కనిపించారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు మహేశ్ ఇన్‌స్టా నిండా కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. తన కొత్త సినిమా కోసమే ఇదంతా చేస్తున్నారని కొంత మంది అంటుంటే.. మరికొందరేమో 'మహేశ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే కదా' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
మళ్లీ సెట్స్‌లోకి 'గుంటూరు కారం'
'అతడు', 'ఖలేజా' తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్- మహేశ్ చేస్తున్న మూడో సినిమా 'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీ లీల, మీనాక్షీ చౌదరీ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల మధ్యలో కాస్త బ్రేక్ పడింది. అయితే గురువారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానుందట. శుక్రవారం నుంచి మహేశ్ బాబు కూడా సెట్స్‌లోకి రానున్నట్లు సమాచారం.
Guntur Kaaram Mahesh Poster : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం 'గుంటూరు కారం' సినిమాలో నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన మహేశ్ బాబు, శ్రీలీల పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఇప్పుడు మరో అప్డేట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
ఆగస్ట్ 9న మహేశ్ బర్త్‌డే సందర్భంగా మూవీ యూనిట్ ఓ మాస్ సర్ప్రైజ్ ఇచ్చింది. బుధవారం అర్ధరాత్రి సరిగ్గా 12:06 నిమిషాలకు గుంటూరు కారం నుంచి మహేశ్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అందులో మహేశ్ లుంగీ కట్టుకుని మాస్ లుక్‌లో కనిపించారు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని.. ఓ చేత్తో స్టైలిష్‌గా చుట్టా కాలుస్తూ కనిపించారు. ఇక ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. రాత్రి నుంచే ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
ఆ రెండు విషయాలపై ఫుల్ క్లారిటీ..
Guntur Kaaram Release Date : గత కొంత కాలంగా ఈ సినిమా చిత్రీకరణలో పలు మార్పులు జరిగాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది. అనుకున్నట్లే సంక్రాంతికి ఈ సినిమా వస్తుందా లేదా అంటూ ఫ్యాన్స్ ఆందోళన పడ్డారు. అయితే ఈ అన్ని ప్రశ్నాలను సమాధానిమచ్చేలా తాజాగా ఓ పోస్టర్‌ను తయారు చేసింది మూవీ టీమ్.
Guntur Kaaram Mahesh Poster : మహేశ్ బాబు బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన ఆ పోస్టర్లో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' విడుదలకు సిద్ధం కానున్నట్లు అఫీషియల్‌గా చెప్పేసింది. అంతే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంటున్నారంటూ గతంలో వచ్చిన వార్తలను పరోక్షంగానే కొట్టిపారేసింది. పోస్టర్లో ఆయన పేరును ప్రస్తావించి ఆ డౌట్‌ను క్లారిఫై చేసింది. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆయనే కొనసాగనున్నట్లు తెలిపింది.
Mahesh Babu Guntur Karam : 'గుంటూరు కారం' కొత్త పోస్టర్స్.. ఏంది సార్ మళ్లీ ఈ కన్ఫ్యూజన్!
Mahesh Babu Birthday : మహేశ్ బర్త్‌డే రోజు అస్సలు అలా చేయరట!.. ఎవ్వరు చెప్పినా.. ఏం జరిగినా!!