ETV Bharat / entertainment

త్రివిక్రమ్​కు మహేశ్​ డెడ్​లైన్​.. కారణమిదే! - రాజమౌళి మహేశ్​ సినిమా

Mahesh Babu Trivikram movie: సూపర్​స్టార్​ మహేశ్​బాబు.. దర్శకుడు త్రివిక్రమ్​కు డెడ్​లైన్ పెట్టారని తెలిసింది. తనతో చేయబోయే సినిమా ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని సూచించారట! వచ్చే ఏడాది నుంచి దర్శకుడు రాజమౌళికి తన డేట్స్​ను కేటాయించడమే అందుకు కారణమని సమాచారం.

Mahesh babu Rajamouli movie
Mahesh babu Rajamouli movie
author img

By

Published : Apr 21, 2022, 10:51 AM IST

Updated : Apr 21, 2022, 11:02 AM IST

Mahesh Babu Trivikram movie: సూపర్​స్టార్​ మహేశ్​బాబు త్వరలోనే 'సర్కారు వారి పాట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శరవేగంగా పోస్ట్​ ప్రొడక్షన్​ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం మే 12న రిలీజ్ కానుంది. దీని తర్వాత ఆయన వరుసగా రెండు సినిమాలకు కమిట్​మెంట్​ ఇచ్చారు. అందులో త్రివిక్రమ్​తో చేయబోతున్న మూవీ ఒకటి. పూజాహేగ్డే హీరోయిన్​. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఇది తెరకెక్కనుంది.

అయితే ఈ సినిమా షూటింగ్​ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మహేశ్​ నిర్ణయించుకున్నారట! ఏమాత్రం ఆలస్యం చేయకుండా జూన్​లో లేదా జూలైలో సెట్స్​పైకి తీసుకెళ్లి ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తిచేయాలని చిత్రబృందానికి సూచించారట. ఎందుకంటే ఆ తర్వాత మహేశ్​ తన డేట్స్​ను పూర్తిగా దర్శకధీరుడు రాజమౌళి కోసం కేటాయించారని తెలిసింది. దీంతో.. మహేశ్​ అభ్యర్థనను దృష్టిలో పెట్టుకున్న మాటల మాంత్రికుడు తన ప్రాజెక్ట్​ను సవాల్​గా తీసుకుని త్వరగా కంప్లీట్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

ఇక రాజమౌళి-మహేశ్​ సినిమా విషయానికొస్తే.. దాదాపు రూ.800కోట్ల భారీ బడ్జెట్​తో రూపొందనుందని సమాచారం. మహేశ్‌కు సరిపోయే కథ, కథనాలతో ఉన్నత నిర్మాణ విలువలతో ఈ ప్రాజెక్ట్​ను తెరకెక్కించనున్నారట. అయితే జక్కన్న గత చిత్రాల మాదిరిగా ఎక్కువ రోజులు కాకుండా ఏడాదిలోపే సినిమాను పూర్తి చేస్తారని టాక్‌. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

ఇదీ చూడండి: ఫ్యాన్స్​కు సారీ.. ఆ యాడ్​ నుంచి తప్పుకున్న అక్షయ్

Last Updated : Apr 21, 2022, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.