Mahesh Babu Son Gautham visits hospital : సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఇద్దరు పిల్లలు. గౌతమ్, సితార. ఈ ఇద్దరిలో సితార ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటుంది. కానీ గౌతమ్ మాత్రం చాలా తక్కువగా కనపడుతుంటాడు. మహేశ్ సతీమణి నమ్రత ఎప్పుడూ.. తన ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన కొడుకు గౌతమ్ ఘట్టమనేని గురించి ఓ విషయాన్ని తెలిపింది. అతడి గొప్ప మనసు ఏంటో తెలియజేస్తూ.. ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Mahesh Babu Heart Foundation : మహేశ్ బాబు సినిమాల్లో మాత్రమే కాదు.. నిజజీవతంలోనూ సూపర్ స్టార్. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. రెయిన్బో హాస్పిటల్స్‌తో కలిసి వేలాదిమంది చిన్న పిల్లలకు హార్ట్ సర్జరీలు చేయించి పునర్జన్మనందిస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే మహేశ్ కుటంబంలో ఎవరో ఒకరు తరచుగా ఆస్పత్రికి వెళ్లి పిల్లలను పలకరించడం, వారితో సరదాగా కాసేపు ముచ్చటించడం చేస్తుంటారు.
Mahesh Babu Heart Operations : అయితే తాజాగా గౌతమ్ హాస్పిటల్‌కు వెళ్లి.. హార్ట్ సర్జరీ చేయించుకున్న చిన్నారులను పరామర్శించినట్లు నమ్రత తెలిపింది. అలానే మానసికంగా వాళ్ళను సంతోష పెట్టేలా కొన్ని గిఫ్ట్స్ కూడా ఇచ్చినట్లు తెలిపింది. సరదాగా కాసేపు వారితో ముచ్చటించి త్వరగా కోలుకునే ధైర్యాన్ని ఇచ్చినట్లు పేర్కొంది. అయితే గౌతమ్ ఇప్పుడు మాత్రమే కాదు.. చాలా సార్లు తన స్కూల్ అయిపోయక ఇలా ఆస్పత్రికి వెళ్లి గుండె చికిత్స తీసుకుంటున్న చిన్నారులను చూసి, వారితో సమయాన్ని గడిపి వస్తాడని చెప్పింది. ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇది చూసిన మహేశ్ అభిమానులు, నెటిజన్లు గౌతమ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఇలాంటి గొప్ప కొడుకే పుడతాడని అంటూ పొగడుతున్నారు. మహేశ్ ఆశయాలను గౌతమ్ ముందుకు నడిపిస్తాడని అంటున్నారు.
తొలిసారి అలాంటి పని చేసిన మహేశ్ కొడుకు.. చెప్పలేనంత బాధగా ఉందన్న నమ్రత
స్టేజ్ డ్రామా వేసిన మహేశ్ తనయుడు.. ఇంగ్లీష్‌లో డైలాగ్‌లు అదరగొట్టేశాడుగా!