ETV Bharat / entertainment

మహేశ్​ 'గుంటూరు కారం' ఘాటు పెరిగింది.. త్వరలోనే..

author img

By

Published : Jun 6, 2023, 5:03 PM IST

Updated : Jun 6, 2023, 5:10 PM IST

#Gunturukaram : సూపర్ స్టార్​ మహేశ్​ బాబు-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబోలో రూపొందుతున్న 'గుంటూరు కారం' మాస్ స్ట్రైక్ గ్లింప్స్ టాలీవుడ్​లో ఇతర ఏ సినిమా అందుకోని ఓ సూపర్ రికార్డును అందుకుంది. అలాగే ఈ చిత్ర కొత్త షెడ్యూల్ వివరాలు బయటకు వచ్చాయి. దాని గురించే ఈ కథనం..

Gunturu karam Mahesh babu
మహేశ్​ 'గుంటూరు కారం' ఘాటు పెరిగింది.. త్వరలోనే..

Guntur Karam Mahesh Babu : సూపర్ స్టార్​ మహేశ్​ బాబు కథానాయకుడిగా డైరెక్టర్​ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందనున్న మాస్​ ఎంటర్​టైనర్​ సినిమా 'గుంటూరు కారం'(#Gunturukaram). ఎన్నో రోజులగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్​ను రీసెంట్​గానే ప్రకటించారు. దీంతో పాటే మాస్ట్​ స్ట్రైక్​ పేరుతో ఓ గ్లింప్స్​ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్​ యాటిట్యూడ్​, స్టైలిష్ లుక్​, మాస్ సీన్స్​, బీజేఎం అదిరిపోయాయి. ముఖ్యంగా మహేశ్​ '‘ఏంది అట్టా చూస్తున్నావు... బీడీ త్రీడీలో కనపడుతుందా?' అంటూ చెప్పిన సంభాషణ బాగా ఆకట్టుకుంది.

హైయెస్ట్​ వ్యూస్​గా రికార్డ్​.. అయితే మొదటి రోజే రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ అందుకున్న ఈ 'మాస్‌ స్ట్రైక్‌' వీడియో ఇప్పుడు టాలీవుడ్​లోనే హైయెస్ట్ వ్యూస్ అంకున్న గ్లింప్స్​గా నిలిచింది. ఈ గ్లింప్స్​ దాని లైఫ్​టైమ్​.. ఇప్పటివరకు ఐదు రోజుల్లో 28.4 మిలియన్​ వ్యూస్​ను అందుకుంది. అలాగే 30 మిలియన్ వ్యూస్ మార్క్​కు టచ్ అయ్యే గ్లింప్స్​గా కూడా ఇది నిలవనుంది. దీని తర్వాత స్థానాల్లో అల్లు అర్జున్​ 'వేర్ ఈజ్ పుష్ప' 28.3 మిలియన్ వ్యూస్​, పవన్​ కల్యాణ్​ 'భీమ్లానాయక్​' 26.5 మిలియన్ వ్యూస్​, విజయ్​ దేవరకొండ 'లైగర్'​ గ్లింప్స్​ 26.1 మిలియన్ వ్యూస్​ అందుకున్నాయి.

25 రోజుల పాటు కొత్త షెడ్యూల్​.. ఈ సినిమా అనౌన్స్​ మెంట్​ చేసినప్పటి నుంచి షూటింగ్ ఆలస్యంగానే సాగుతూ వస్తోంది. అయితే వాయిదాలు పడుతున్నప్పటికీ షెడ్యూల్స్​ను సాఫీగానే మేకర్స్ కంప్లీజ్ చేస్తున్నారు. అయితే ఈ సారి కొత్త షెడ్యూల్​ను జూన్​ 12నుంచి ప్రారంభం చేయనున్నారట. దాదాపు 25రోజుల పాటు ఈ లాంగ్​ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకోనుంది. అలాగే ఈ షెడ్యూల్​లో శ్రీలీల కూడా జాయిన్ కానుంది. ఆమెపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దీంతో మహేశ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తన్నారు. ఆగస్టులో మహేశ్​ బర్త్​డే నాటికి మరో అదిరిపోయే టీజర్​ రెడీ అవుతుందని ఆశిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Guntur karam movie release date : కాగా, 'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత మహేశ్‌ - త్రివిక్రమ్‌ కలిసి చేస్తున్న సినిమా ఇది. పూజాహెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు. పి.ఎస్‌.వినోద్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

ఇదీ చూడండి :

పార్టీలో మహేశ్​ బాబు సందడి.. ఆ స్మైల్​కు ఫ్యాన్స్​ ఫిదా!

రూ. 1050 కోట్లతో 'పఠాన్'​ నెం.1.. టాప్​-10లో చిరు, బాలయ్య మూవీస్​.. హైయెస్ట్ గ్రాసింగ్​ ఫిల్మ్స్ ఇవే!

Last Updated : Jun 6, 2023, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.