ETV Bharat / entertainment

'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్​ నయా అప్డేట్​- హైదరాబాద్​లో మాత్రం కాదు! - గుంటూరు కారం ట్రైలర్

Mahesh Babu Guntur Kaaram Pre Release event : 'గుంటూరు కారం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​ గురించి మరో కొత్త సమాచారం అందింది. ఆ వివరాలు

గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్​ కొత్త అప్డేట్​ -  హైదరాబాద్​లో మాత్రం కాదు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 5:08 PM IST

Mahesh Babu Guntur Kaaram Pre Release event : 'గుంటూరు కారం' సినిమాకు వచ్చిన హైప్ చూస్తుంటే బాక్సాఫీస్ ఊచకోత గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇటీవలే ప్రభుత్వం నుంచి ప‌ర్మిష‌న్ రాకపోవడం వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ నిరాశ పడ్డారు. ముఖ్యంగా ఈ ఈవెంట్​లో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేస్తారని చెప్పి ఈవెంట్​ క్యాన్సిల్ చేయడం వల్ల మహేశ్​ అభిమానులు బాగా నిరాశ చెందారు. అయితే ఇప్పుడా నిరాశలను పటాపంచలు చేస్తూ మేకర్స్ ట్రైలర్(Guntur Kaaram Trailer)​ రిలీజ్​కు రెడీ అయిపోయారు.

దీంతో ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీగా ఉన్నారు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సంగతి ఏంటి? అనేది కూడా ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్​ నిర్వహించేందుకు మేకర్స్​ రెడీ అవుతున్నారని తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి దొరకకపోవడంతో ఆంధ్రాకు వేదిక మార్చారని టాక్ వినిపిస్తోంది. జనవరి 9న గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. దీనిపై మూవీ టీమ్​ అధికారిక ప్రకటన కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక గుంటూరు కారం సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్​గా నటిస్తుండగా, సెకండ్ హీరోయిన్​గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ప్రకాశ్​ రాజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీత దర్శకుడు. ఇప్పటికే రిలీజైన పాటలు కూడా సూపర్ హిట్​గా నిలిచాయి. 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడం వల్ల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. యాక్షన్‌ డ్రామాగా ఇది సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 11న అమెరికాలో 5,408 ప్రీమియర్‌ షోలు వేయనున్నారు. ఒక తెలుగు సినిమాకు ఇన్ని షోలు వేయడం రికార్డనే చెప్పాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సంక్రాంతి సినిమాల బిజినెస్ లెక్కలు - బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎన్ని కోట్లు అంటే?

'గుంటూరు కారం' - అరే అచ్చం పవన్ సినిమాకు జరిగినట్టే జరుగుతోందిగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.