ETV Bharat / entertainment

పూజా హెగ్డేకు అది గట్టి దెబ్బే.. బ్యూటీ చూపు అటువైపే! - గుంటూరు కారంలో పూజా హెగ్డే

తన అందచందాలతో టాలీవుడ్​ను షేక్​ చేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ అమ్మడు కెరీర్​ పరంగా సతమతమవుతోంది. చేతినిండా ప్రాజెక్ట్స్​తో సందడి చేసే ఈ చిన్నది ఇప్పుడు డీలా పడిపోయి కనిపిస్తోంది. దీనికి కారణం ఏంటంటే ?

Pooja hegde 2023
Pooja hegde 2023
author img

By

Published : Jul 2, 2023, 10:52 PM IST

Pooja Hegde Movies : 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత మెగా ప్రిన్స్​ వరుణ్ తేజ్​తో ​'ముకుందా' సినిమాలో నటించి టాలీవుడ్​ ఆడియన్స్​కు మరింత దగ్గరైంది. ఆ తర్వాత నుంచి వరుస ఆఫర్లలో టాలీవుడ్​లో క్రేజ్​ సంపాందిచుకుంది. 'అల వైకుంఠపురం', 'దువ్వాడ జగన్నాథం', 'మహర్షి', 'గద్దల కొండ గణేష్'​ లాంటి సినిమాల్లో నటించి.. నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అంత వరకు బాగుందని అనుకున్న ఈ చిన్నదాని కెరీర్​లో అనుకోని ట్విస్ట్​లు వచ్చాయి. 2021లో అఖిల్​ హీరోగా వచ్చిన 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్​' యావరేజ్​ టాక్ అందుకోగా.. ఆ తర్వాత వచ్చిన 'రాధే శ్యామ్'​, 'బీస్ట్'​,'ఆచార్య' సినిమాలు బాక్సాఫీస్​ ముందు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. దీంతో ఈ బ్యూటీ స్లోగా బాలీవుడ్​ వైపునకు అడుగులేసింది.

Pooja Hegde Bollywood Movies: అప్పటికే 'మోహంజదారో', 'హౌస్​ఫుల్​ 4' ద్వారా బీటౌన్​ ఆడియన్స్​కు చేరువైన ఈ తార.. కండల వీరుడు సల్మాన్​ ఖాన్​ హీరోగా తెరకెక్కిన 'కిసీ కా భాయ్​ కిసీకి జాన్'​ సినిమాతో మరోసారి హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సరైన వేదిక అని అనుకున్న ఈ చిన్నదానికి ఆ సినిమాతో కూడా నిరాశే ఎదురైంది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ టాలీవుడ్​కు వచ్చేసింది. మహేశ్ సరసన 'గుంటూరు కారం', పవన్​ కల్యాణ్​ సరసన​ 'ఉస్తాద్​ భగత్​ సింగ్'లో​ అవకాశాన్ని అందిపుచ్చుకుని సేఫ్​ సైడ్​లోకి వెళ్లిపోయింది.

Guntur Kaaram Heroine : ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్​లో ఫేమస్​ అవుతున్న యంగ్​ స్టార్​ శ్రీలీల.. పూజా సైన్​ చేసిన ఈ రెండు ప్రాజెక్ట్​ల్లోనూ కీలక పాత్ర​ పోషిస్తోంది. తొలుత పూజా స్థానానికి ఎటువంటి కాంపిటిషన్​ లేకుండా షూటింగ్​ కూడా సజావుగా సాగింది. అయితే అనూహ్యమైన పరిణామాల వల్ల ఈ రెండు ప్రాజెక్ట్స్​ నుంచి బుట్టబొమ్మ ఎగ్జిట్​ అయిపోయింది. దీనికి కారణం ఏమై ఉండొచ్చని అభిమానులు సతమతమౌతున్న తరుణంలో ఆ రెండు సినిమాల్లోనూ పూజా ప్లేస్​లో శ్రీ లీలను తీసుకున్నారు మేకర్స్. దీంతో పూజాకు టాలీవుడ్​లో గట్టి ఎదురుదెబ్బే తగిలింది.

ఒక్కప్పుడు టాలీవుడ్​ను ఓ ఊపు ఊపేసిన ఈ చిన్నది ఇప్పుడు వరస ఆఫర్లు కోల్పోయి డీలా పడిపోవడాన్ని చూసి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ చిన్నది మరోసారి బాలీవుడ్​ వైపునకు మొగ్గు చూపే ప్రయత్నాల్లో ఉందట. అధికారికంగా ఎటువంటి ప్రకటనైతే రానప్పటికీ.. ఈ చిన్నదాని కాల్షీట్స్​ కోసం బీ టౌన్​ దర్శకులు లైన్​లో వెయిట్​ చేస్తున్నారట. దీంతో అక్కడైన ఓ హిట్ పడితే పూజా దశ మారిపోతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.