ETV Bharat / entertainment

Leo Villain : ఏంటి.. 'లియో'లో విలన్​ స్టార్​ కొరియోగ్రాఫరా?.. భయపెట్టేశాడుగా! - లియో మూవీ శాండీ మాస్టర్​

Leo Villain : తమిళ హీరో విజయ్​.. 'లియో' మూవీ బాక్సాఫీస్​ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమా ప్రారంభ సన్నివేశాల్లో సైకో కిల్లర్​గా ఓ కుర్రాడు నటించాడు. తన యాక్టింగ్​తో ఒకింత భయపెట్టేశాడు. ఇంతకీ అతడెవరో గుర్తుపట్టారా?

Leo Opening Day Collection Worldwide
Leo Opening Day Collection Worldwide
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 10:31 PM IST

Updated : Oct 20, 2023, 10:39 PM IST

Leo Villain : తమిళ నటుడు దళపతి విజయ్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'లియో'. లోకేశ్​ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్​ 19న థియేటర్లలో గ్రాండ్​గా రిలీజైంది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా తమిళంలో ఆశించిన స్థాయిలో టాక్​ను అందుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షాన్ని కూడా కురిపిస్తోంది. అయితే ఈ సినిమా ప్రారంభ సన్నివేశాల్లో సైకో కిల్లర్​గా ఓ కుర్రాడు నటించాడు. తన యాక్టింగ్​తో భయపెట్టేశాడు. కాసేపు వణికించాడు. మూవీ మొదట్లో కనిపించేది అతడు కాసేపే అయినా సైకో కిల్లర్ పాత్ర చాలామందికి గుర్తుండిపోతుంది. ఆ పాత్ర చేసింది ఎవరో తెలుసా?.. స్టార్ కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్.

'చాక్లెట్​ కాఫీ'తో రచ్చరచ్చ!
Sandy Master Leo : తమిళంలో కొరియోగ్రాఫర్‌గా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు శాండీ మాస్టర్. అతడు కొన్ని సినిమాల్లో కామెడీ తరహా రోల్స్ చేశాడు. కానీ 'లియో'లో మాత్రం సైకో కిల్లర్ పాత్రలో వణికించేశాడు. హీరోతో తలపడే సీన్‌లో 'చాక్లెట్ కాఫీ' అని రచ్చ లేపాడు. 2005లో 'మానాడా మయిలాడా' అనే డ్యాన్స్ షోతో కెరీర్ ప్రారంభించిన ఇతడు.. అదే షో హోస్ట్ చేసిన కాలా మాస్టర్ దగ్గర శిక్షణ పొందాడు.

Sandy Master Movies : 2014లో 'ఆహ్' సినిమాతో కొరియోగ్రాఫర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు శాండీ. ఆ తర్వాత ఏడాదే 'ఇవనుక్కు తన్నిళ్ల గండం' అనే మూవీతో నటుడు కూడా అయిపోయాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఓ 20కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫీ చేశాడు. రజనీకాంత్, విశాల్ తదితర సినిమాలకు పనిచేశాడు. ఇక 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్​లో భాగంగా శాండీ మాస్టర్ చేసిన స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇప్పటికీ అలరిస్తూ ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తొలిరోజు వసూళ్ల వర్షం
Leo Opening Day Collection Worldwide : 'లియో' సినిమాలో యాక్షన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని నెటిజన్లు అంటున్నారు. కానీ మిగతా విషయాల్లో మాత్రం ప్రేక్షకుల్ని అంచనాల్ని అందుకోవడంలో డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఫెయిలయ్యాడని చెబుతున్నారు. ఇకపోతే వసూళ్ల విషయంలో ఈ సినిమా తొలిరోజు దుమ్మురేపింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.148.5 కోట్ల గ్రాస్​ వసూలు చేసినట్లు మేకర్స్​ ప్రకటించారు.

Leo Movie Telugu Review : సినిమాలో ఆ 3 టర్నింగ్​ పాయింట్స్​.. లోకేశ్​ మ్యాజిక్​కు ఆడియెన్స్​ రెస్పాన్స్​ ఇదే!

Leo Movie Fans marriage : 'లియో' స్పెషల్.. థియేటర్​లో దండలు మార్చుకున్న జంట!

Last Updated : Oct 20, 2023, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.