ETV Bharat / entertainment

లావణ్య 'హ్యాపీ బర్త్​డే' ట్రైలర్.. గన్​లతో ఫన్​.. కితకితలే! - లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్​డే సినిమా

Lavayna Tripathi Happy Birthday trailer: హీరోయిన్​ లావణ్య త్రిపాఠి నటించిన 'హ్యాపీ బర్త్‌డే' ట్రైలర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అలరిస్తోంది.

Lavayna Tripathi Happy Birthday movie trailer
లావణ్య 'హ్యాపీ బర్త్​డే' ట్రైలర్
author img

By

Published : Jun 29, 2022, 5:43 PM IST

Lavayna Tripathi Happy Birthday trailer: హీరోయిన్​ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. రితేశ్‌ రానా దర్శకత్వం వహించారు. ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్​ను రిలీజ్​ చేసింది మూవీటీమ్​. ఈ సినిమా కథ తుపాకుల చుట్టూ తిరుగుతుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. 'నా ఏడు వారాల నగలతో చేయించా. నేనూ నా రవ్వల నెక్లెస్‌తో చేయించా', 'రివాల్వర్‌లో ఉండే రాజసం పిస్తోల్లో లేదండి','ఆవేశం అగ్గిపుల లాంటిది ఒక్కసారే వెలిగించవచ్చు. కానీ ఆశయం లైటర్ లాంటిది. ఎన్ని సార్లు అయినా వెలిగించవచ్చు' అనే సంభాషణలతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. 'వాడు ప్రొఫెషనల్‌ కిల్లర్‌ అయితే నేను పెయిన్‌ కిల్లర్‌' అని సత్య చెప్పడం, దానికి వెన్నెల కిశోర్‌ కౌంటర్‌ ఇచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి.

ట్రైలర్‌లో కనిపించిన ప్రతి పాత్ర చేతిలోనూ గన్‌ కనిపించింది. అసలు వీరందరికీ తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటికీ బర్త్‌డే పార్టీకి సంబంధమేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో నరేశ్‌ అగస్త్య కీలక పాత్ర పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఓరి దేవుడా, ఆపండ్రా బాబు.. నేనేం చేసుకోవట్లే: హీరో రామ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.