ETV Bharat / entertainment

ఫ్యాన్స్​కు రజనీ మరో సర్​ప్రైజ్.. ఆ స్టార్ హీరో సినిమాలో గెస్ట్​గా! - lal salaam laika productions

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్​ ఫ్యాన్స్​కు మరో సర్​ప్రైజ్​ ఇచ్చారు. ఓ హీరో చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఆ చిత్రానికి తన కుతూరు ఐశ్వర్య దర్శకత్వం వహించనుండటం విశేషం.

rajanikanth
రజనీకాంత్
author img

By

Published : Nov 5, 2022, 2:26 PM IST

సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్‌కు ఇటీవలే భారీ సర్‌ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైలర్​ సినిమాతో బిజీగా ఉన్న ఆయన.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​తో కలిసి రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్​ ఇచ్చారు. అయితే ఆ చిత్రాల అప్డేట్స్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా గుడ్‌ న్యూస్ చెప్పారు.

తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ​దర్శకత్వం వహించబోతున్న కొత్త సినిమాలో గెస్ట్​ రోల్​లో కనిపించనున్నారు. విష్ణు విశాల్​, విక్రాంత్​లు ప్రధాన పాత్రల్లో నటించబోతున్న ఈ చిత్రానికి లాల్​ సలామ్​ అనే టైటిల్​ను ఖరారు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్​ను లైకా ప్రొడక్షన్స్​ ట్వీట్​ చేసింది. ఈ పోస్టర్​లో మంటల్లో కాలుతున్న ఒక హెల్మెట్​ను చూపించారు. దీనితో పాటు పక్కన ఓ బాల్, వికెట్ బెల్స్ పడుండటం కన్పిస్తుంది. దీనిని చూస్తుంటే ఈ సినిమాను స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు అర్ధమవుతుంది. అభిమానుల్లో మూవీపై క్యూరియాసిటీ పెరుగుతోంది.

కాగా, రజనీకాంత్​ ప్రస్తుతం జైలర్​ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ సంవత్సరాది సందర్భంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. వినోదం, థ్రిల్లింగ్‌ అంశాలతో పాటు రజనీ అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని చిత్రబృందం చెబుతోంది. రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంలో యువ కథానాయకుడు శివ కార్తికేయన్‌ అతిథి పాత్రలో మెరవనున్నాడు.

ఇవీ చదవండి:కాబోయే భర్తతో హన్సిక ఫొటో లీక్‌.. స్పందించిన బ్యూటీ

మీలాంటి వారిని షోకు పిలవడమే తప్పు: బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.