ETV Bharat / entertainment

Rangamarthanda: 'ఆ ఒక్క సీన్​ను 36 గంటల పాటు షూట్‌ చేశాం' - rangamarthanda teaser

దర్శకుడు కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'రంగమార్తాండ'. ఆయన ఈ చిత్రంలో నటించిన రమ్యకృష్ణ పాత్ర గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఆ సంగతులు..

Rangamartanda
Rangamarthanda: 'ఆ ఒక్క సీన్​ను 36 గంటల పాటు షూట్‌ చేశాం'
author img

By

Published : Mar 18, 2023, 9:42 PM IST

ప్రకాశ్ రాజ్​, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో దర్శకుడు కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'రంగమార్తాండ'. హౌస్​ఫుల్​ మూవీస్, రాజశ్యామల ఎంటర్​టైన్మెంట్స్​ బ్యానర్​పై ఈ మూవీని నిర్మించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ.. ఈ చిత్రంలో తన భార్య రమ్యకృష్ణ పోషించిన పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఆమెకు సంబంధించిన సన్నివేశాన్ని 36 గంటల పాటు షూట్​ చేసినట్లు తెలిపారు.

సెంటిమెంట్‌ అడ్డొచ్చినా సినిమాకే హైలైట్​గా నిలిచేది అవ్వడం వల్ల ఆ సన్నివేశాన్ని తీయక తప్పలేదని చెప్పారు. ఆ సమయంలో ఏడ్పు వస్తున్నా.. గుండెను రాయి చేసుకుని చిత్రీకరణ పూర్తి చేసినట్లు తెలిపారు. ఆ రోజు రాత్రి నిద్ర కూడా అస్సలు పట్టలేదని చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి ఒరిజినల్​ అయిన మరాఠీ మూవీ 'నట్‌ సామ్రాట్‌' బాగా నచ్చిందని చెప్పారు. అయితే రీమేక్​లో తాను కొన్ని మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చారు.

నేటివిటీని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టును కొత్తగా రాసిటన్లు తెలిపారు. తెలుగు భాష గొప్పదనాన్ని చాటిచెప్పే ఓ సీన్‌ ఈ మూవీలో ఉందని అది ఆడియెన్స్​ను కట్టిపడేస్తుందని వెల్లడించారు. ఇక నటుడు బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో బ్రహ్మి పోషించిన పాత్ర ఆయన ఇమేజ్‌కు డిఫరెంట్​గా ఉంటుందని తెలిపారు. అన్ని సినిమాల్లోనూ ఆయన్ను ఎక్కువగా క్లోజప్‌ షాట్స్‌లో చూపించారని, తాను మాత్రం లాంగ్‌ షాట్స్‌లో ఎక్కువగా చూపించినట్లు చెప్పుకొచ్చారు. దాని వెనుక కారణం సినిమా చూస్తే అర్థమవుతుందని అని పేర్కొన్నారు.

ఇకపోతే తాజాగా.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా టీజర్​ను మూవీటీమ్​ విడుదల చేసింది. ఉగాది సందర్భంగా మార్చి 22న ఈ మూవీ రిలీజ్ కానుంది. శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ తదితరులు కూడా ఈ చిత్రంలో నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రివ్యూలను కూడా ప్రదర్శిస్తున్నారు. దర్శకులు హరీశ్‌ శంకర్‌, శేఖర్‌ కమ్ముల, దేవ కట్టా, బి. గోపాల్‌, నందిని రెడ్డి, బుచ్చిబాబు, తేజ, అనుదీప్‌ కె. వి. తదితరులు ఈ సినిమా చూసి తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర సెలబ్రిటీలు కూడా ప్రశంసిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం పోషించిన పాత్ర బాగా ఎమోషనల్​కు గురిచేస్తుందని చెబుతున్నారు. బ్రహ్మానందం ఈ డిఫరెంట్​ క్యారెక్టర్‌ పోషించడం, భారీ తారాగణం ఉండటం, మెగాస్టార్​ చిరంజీవి ఓ షాయరీ ఆలపించడం.. ఇలా అన్ని అంశాలు ఆడియెన్స్​లో ఈ మూవీపై బాగా ఆసక్తి నెలకొల్పాయి. దీంతో సినిమా చూసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇదీ చూడండి: వెయ్యి కోట్ల క్లబ్​లో టాలీవుడ్​, శాండల్​ వుడ్​.. కోలీవుడ్ ఆశలన్నీ ఆ సినిమాపైనే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.