చిరంజీవి- రామ్‌చరణ్ కాంబినేషన్లో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన 'ఆచార్య' సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు. అయితే ఆ సినిమా సమయంలో చరణ్ కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నారు కొరటాల. ఆ కథ సైతం చరణ్‌కు నచ్చిందట. ఎన్టీఆర్‌తో చేసే సినిమా పూర్తయ్యాక.. తర్వాత చరణ్‌తో ఆ మూవీ తీయాలనుకున్నారట కొరటాల. 'ఆచార్య' నిరాశ పర్చడం వల్ల.. ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తుందా? లేదా? అనే సందిగ్ధిత నెలకొంది. 'ఆచార్య'ను మరిచిపోయి.. కొరటాలతో అంతకుముందు ఓకే చెప్పిన ప్రాజెక్టును సెట్స్‌పైకి తెసుకెళ్లేందుకు చరణ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కేజీఎఫ్-3 రూమర్..
కన్నడ హీరో యశ్‌తో ప్రశాంత్‌నీల్ సృష్టించిన ప్రభంజనం కేజీఎఫ్-1, కేజీఎఫ్-2. ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ సినిమా బీజీలో ఉన్నారు ప్రశాంత్. భవిష్యత్ కేజీఎఫ్-3 ఉంటుందని చెప్పారు ప్రశాంత్. వాస్తవానికి మూడో సీక్వెల్‌ను ఇప్పట్లో తెరకెక్కించే ఆలోచన లేదని అటు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ చెప్పినా.. ఆ సినిమాపై మాత్రం పలు రూమర్లు ఆగడం లేదు. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్‌రోషన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. యశ్ స్థానంలో హృతిక్‌ను తీసుకొని.. నేరుగా బాలీవుడ్లో సినిమాను తీయాలని ప్రశాంత్ భావిస్తున్నట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.
ఇదీ చదవండి: ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..