ETV Bharat / entertainment

'OG సీన్స్​ చూశాక దిమ్మ తిరిగిపోయింది'.. పవన్ ఫ్యాన్స్​కు కిక్ ఇచ్చే న్యూస్! - పవన్​ కల్యాణ్​ OG

OG Arjun Das : పవర్​స్టార్​ పవన్ కల్యాణ్​ OG సినిమాకు సంబంధించి కీలకమైన విషయాలను చెప్పేశాడు అందులో నటిస్తున్న తమిళ యువ నటుడు అర్జున్​ దాస్​. ఇంతకీ ఆయన ఏం అన్నాడంటే?

OGలోని సీన్స్​ ఎలా ఉన్నాయో చెప్పేసిన అర్జున్​ దాస్.. ఫ్యాన్స్​ సిద్ధం కండి అంటూ..!
Pawan Kalyan OG Movie Update Arjun Das Tweet
author img

By

Published : Jun 23, 2023, 8:23 PM IST

Pawan Kalyan OG Movie : సాహో దర్శకుడు సుజిత్​, పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం OG (ఓరిజినల్​ గ్యాంగ్​స్టర్స్​). గ్యాంగ్ స్టార్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను ఫుల్​ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా రూపొందిస్తున్నారు డైరెక్టర్ సుజిత్​. కాగా, సినిమా అవుట్​ పుట్​ మెరుగ్గా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఈ సినిమా కోసం ప్రముఖ నటీనటులను కేర్​ఫుల్​గా సెలెక్ట్​ చేసుకున్నారు​. ఇందులోని ప్రధాన పాత్రల్లో నటించేందుకు కోలీవుడ్​ నటులు అర్జున్​ దాస్​, శ్రియా రెడ్డిలతో పాటు బాలీవుడ్​ నటుడు ఇమ్రాన్​ హష్మీలను ఎంచుకున్నారు.

Arjun Das Twitter : ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటిస్తున్న అర్జున్​ దాస్​ తాజాగా ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలను చూశాడట. దీనికి సంబంధించిన వివరాలను ట్విట్టర్​లో షేర్​ చేశాడు. ఆ సీన్స్ చూశాక తన దిమ్మ తిరిగిపోయిందని చెప్పుకొచ్చాడు. 'పవన్​ కల్యాణ్​ నటిస్తున్న OGలోని కొన్ని సీన్స్​ను డైరెక్టర్​ సుజిత్​ నాకు చూపించారు. అవి నేను చూశాను. చాలా అద్భుతంగా ఉన్నాయి' అంటూ అర్జున్​ దాస్​ ట్వీట్​ చేశాడు. దీంతో ఇప్పటికే ఈ మూవీపై ఉన్న అంచనాలు మరింతగా పెంచేశాడు ఈ యువ నటుడు​.

  • #Sujeeth Sir was kind enough to show me a few visuals from #OG yesterday & I’m truly blown away.@dop007 Sir’s visuals 🔥@PawanKalyan Garu’s screen presence, swag & dialogues 🔥🔥💥💥

    All I will say is - Pawan Kalyan Garu’s fan’s assemble!

    The #FireStorm is truly coming!
    A…

    — Arjun Das (@iam_arjundas) June 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సుజిత్ సర్ నాకు OGలోని కొన్ని విజువల్స్ చూపించారు. అవి చూసాక నా మైండ్ బ్లాక్​ అయ్యింది. పవన్ కల్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, స్వాగ్, డైలాగ్స్ మాత్రం అదిరిపోయాయి. ఇక డీఓపీ రవి కే చంద్రన్ గారి విజువల్స్​ సూపర్. ఫ్యాన్స్ రెడీగా ఉండండి. అందరికి నేను చెప్పేది ఏంటంటే.. పవన్​ కల్యాణ్​ అభిమానులారా OG కోసం సిద్ధంగా ఉండండి. ఫైర్​ స్టార్మ్​ నిజంగా వచ్చేస్తోంది."
-అర్జున్​ దాస్​, నటుడు

OG Arjun Das : ఇక అర్జున్​ చేసిన ఈ పవర్​ఫుల్​ ట్వీట్​ ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. ఇటీవలే ఈ సినిమాపై శ్రియా రెడ్డి సైతం ఆసక్తికర కామెంట్స్​ చేసింది. ఇలా OGలో నటించే వారే స్వయంగా ఇలా కామెంట్స్​ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. యాక్షన్ ఫీస్ట్​ చిత్రంగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్​ మూవీ కోసం పవన్​ ఫ్యాన్స్​తో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

OG Movie Pawan Kalyan : ఈ సినిమాలో పవన్​కు జంటగా నటి ప్రియాంక అరుళ్​ మోహన్​ హీరోయిన్​గా నటిస్తోంది. OGలో పవన్ సరికొత్త లుక్​లో కనిపించనున్నారు. ఇందులో తమిళ యువ నటుడు అర్జున్ దాస్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య డీవీనీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్​పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ​ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎడిటింగ్​ పనులను కూడా ప్రారింభించినట్లు తెలుస్తోంది. మరోపక్క మిగతా షూటింగ్​ను కూడా వీలైనంత త్వరగా పుర్తి చేసి ఈ ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీగా ఉన్న పవన్.. అది ముగించుకొని OG సెట్స్​లోకి తిరిగి వెళ్లే అవకాశం ఉందని సినీ ఇండస్ట్రీలో టాక్​. దీంతో పాటు హరి హర వీరమల్లు, ఉస్తాద్‌ భగత్ సింగ్​ ప్రాజెక్ట్స్​లు కూడా పవన్​ చేతిలో ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.