ETV Bharat / entertainment

Video Viral: హీరో యశ్​పై ఫిర్యాదు​!.. బ్యాడ్​ గాయ్​ అని ఏడుస్తూ..

author img

By

Published : Jul 17, 2022, 6:32 PM IST

కన్నడ రాకింగ్ స్టార్​ యశ్​కు సంబంధించిన సోషల్​మీడియాలో ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. ఇందులో యశ్​ను ఉద్దేశిస్తూ.. ఆయన బ్యాడ్​ గాయ్​ అని ఒకరు కన్నీరుపెట్టుకుంటూ చెప్పారు. ఇంతకీ అలా అన్నదెవరంటే?

hero yash
హీరో యశ్​

'కేజీయఫ్‌'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ రాకింగ్​ స్టార్​ యశ్‌.. ప్రస్తుతం ఫ్యామిలీ టైమ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. 'కేజీయఫ్‌-2' తర్వాత ఆయన ఇంకా కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించలేదు. దీంతో షూట్స్‌ లేకపోవడం వల్ల ఇంట్లోనే ఉండి తన ఇద్దరు పిల్లలతో సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. ఇందులో భాగంగానే యశ్‌ తాజాగా తన తనయుడు యథర్వ్‌ కలిసి ఓ సరదా వీడియో చేశారు. బ్రష్‌ చేయడం గురించి యశ్‌ మందలించడంతో కాస్త నొచ్చుకున్న యథర్వ్‌.. తన తల్లి రాధికా పండిత్‌ని హత్తుకుని.. 'డడ్డా ఈజ్‌ ఏ బ్యాడ్‌ బాయ్‌' అని చెబుతూ కనిపించాడు. దీంతో యశ్‌.. 'డాడా (నాన్న) ఈజ్‌ ఏ గుడ్‌ బాయ్‌' అనగా.. 'నో.. నాన్న బ్యాడ్‌ బాయ్‌. అమ్మ గుడ్‌ గర్ల్‌‌' అని సమాధానమిస్తాడు. ఈ సరదా వీడియోని రాధిక ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేయగా.. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

కాగా, 'కేజీయఫ్​ 2' తర్వాత హీరో యశ్​ చేయబోయే సినిమాపై దేశవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ కేజీయఫ్​ రెండో భాగం​ విడుదలై నెలలు గడుస్తున్నా ఆయన నుంచి ఇంకా ఎటువంటి సినిమా ప్రకటన రాలేదు. దీంతో ఆయన నెక్ట్స్​ ఏ దర్శకుడితో చేయనున్నారు? ఎలాంటి ప్రాజెక్ట్​ను ప్రకటించనున్నారు? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే యశ్​.. తన తదుపరి చిత్రాన్ని కన్నడ దర్శకుడు నార్తన్​తో చేయబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. 'కేజీయఫ్ 2' కన్నా ముందుగానే దీనికే గ్రీన్​సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పాన్​ ఇండియా స్థాయిలో ఆయనకు ఉన్న ఇమేజ్​ను దృష్టిలో పెట్టుకుని నార్తన్​ ఏడాదిన్నర నుంచి ఓ పవర్​ఫుల్​ స్క్రిప్ట్​ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వర్క్​ తుది దశకు చేరుకున్నట్లు టాక్​. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుందని వార్తలు వస్తన్నాయి.

ఇదీ చూడండి: యశ్​ నెక్ట్స్​ మూవీ అనౌన్స్​కు ప్లాన్​.. దర్శకుడు అతడే.. హీరోయిన్​ ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.