ETV Bharat / entertainment

'కేజీఎఫ్'​ ప్రొడక్షన్​ హౌస్​తో సుధా కొంగర కొత్త సినిమా

author img

By

Published : Apr 21, 2022, 1:08 PM IST

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ తమ కొత్త సినిమాను స్టార్​ దర్శకురాలు సుధ కొంగరతో చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..

Homable films new film with Director Sudha kongara
హోంబలే ఫిల్మ్​ సుధా కొంగర

'కేజీయఫ్‌' సిరీస్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న కన్నడ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌. ఈ పతాకంపై యశ్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన 'కేజీయఫ్‌ 1', 'కేజీయఫ్‌ 2' చిత్రాలు భారతీయ అభిమానులందరినీ కన్నడ చిత్ర పరిశ్రమ వైపు దృష్టి పెట్టేలా చేశాయి. దాంతో అక్కడ రూపొందుతున్న కొత్త చిత్రాలపై అంతటా ఆసక్తి నెలకొంది. మరోవైపు 'గురు', 'ఆకాశం నీ హద్దురా', 'పావ కథైగళ్'(వెబ్​సిరీస్​)​ చిత్రాలతో ఒక్కసారిగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీని ఆకర్షించారు డైరెక్టర్‌ సుధా కొంగర. దీంతో ఆమె తీయబోయే కొత్త సినిమాపై సినీప్రియుల్లో భారీగా ఆసక్తి నెలకొంది. ఇప్పుడీ నిర్మాణ సంస్థ, దర్శకురాలు ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతి పంచేందుకు ఏకమయ్యారు. తమ కలయికలో ఓ కొత్త సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్​ సోషల్​మీడియా వేదికగా తెలిపింది.

"కొన్ని కథలు ప్రజలకు చెప్పడానికి అర్హమైనవి, వాటిని సరైన పద్ధతిలో ఆవిష్కరించాలి. మా తదుపరి చిత్రాన్ని దర్శకురాలు సుధా కొంగరతో నిర్మిస్తున్నట్లు ప్రకటించడానికి గర్వపడుతున్నాము. మా అన్ని సినిమాల వలే ఇది కూడా విభిన్నమైనది. నిజమైన సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించబోతున్నాం"అంటూ ఓ ఫొటోను షేర్‌ చేసింది. దీంతో ఈ సినిమాపై సినీప్రియుల్లో విపరీతమైన ఆసక్తి పెరిగింది. మరి ఎలాంటి చిత్రంతో ఈ అద్భుత కలయిక రాబోతుందో చూడాలి.

homable
హోంబలే

ఇదీ చూడండి: 'ఆచార్య'కు మహేశ్​ గళం.. కలెక్షన్లలో 'కేజీఎఫ్​ -2' సరికొత్త రికార్డు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.