ETV Bharat / entertainment

KGF 3 Update : 'కేజీఎఫ్-3' సెట్స్​పైకి వెళ్లేది ఆ రోజే.. రిలీజ్​ డేట్​ కూడా.. - యశ్​ కేజీఎఫ్​ మూవీ అప్డేట్​

KGF 3 Update : యశ్​ ఫ్యాన్స్​తో పాటు సినీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న 'కేజీఎఫ్​-3' సినిమా గురించి తాజాగా ఓ అప్డేట్​ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అదేంటంటే?

KGF 3 Update
KGF 3 Update
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 5:50 PM IST

KGF 3 Update : కన్నడ స్టార్ హీరో యశ్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'కేజీఎఫ్‌' సిరీస్​.. సినీ ఇండస్ట్రీలో ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బజ్​ లేకుండా 2018లో విడుదలైన పార్ట్​-1.. రిలీజ్​ అయిన కొద్ది రోజుల్లోనే ట్రెండ్​ సృష్టించింది. యావత్ సినీ ఇండస్ట్రీని శాండల్​వుడ్ ​వైపునకు తిప్పింది. యశ్​ సినీ కెరీర్​ను ఓ మలుపు​ తిప్పిన ఈ మూవీ.. ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ సెన్సేషన్​ క్రియేట్ చేసింది. ఇదే జోరుతో దర్శకుడు ప్రశాంత్​ నీల్ 2022లో ఈ సినిమాకు సీక్వెల్​ను తెరకెక్కించారు. ఇది కూడా మెదటి పార్ట్​ కంటే ఎక్కువగా వసూళ్లను సాధించి టాక్​ ఆఫ్​ ద టౌన్​గా మారింది. అయితే ఈ చిత్రంతోనే ఈ కథ ఓ కొలిక్కి వస్తుందని అనుకుంటే.. సీన్​ రివర్స్​ అయ్యింది.

KGF 3 Movie Update : సెకెండ్​ పార్ట్​ ఎండింగ్​లో 'కేజీఎఫ్​- ఛాప్టర్​ 3' ఉంటుందని దర్శకుడు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్​లో మరింత ఆసక్తి నెలకొంది. దీంతో పాటు సినిమా కూడా కన్​క్లూజన్​ లేకుండా వదిలిపెట్టడం వల్ల అభిమానులు కూడా ఈ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ వస్తుందని అనుకున్నారు. కానీ అటు ప్రోడక్షన్​ హౌస్​ గానీ ఇటు హీరో గానీ ఎటువంటి అప్​డేట్​ను షేర్​ చేయలేదు. అంతే కాకుండా దర్శకుడు ప్రశాంత్​ నీల్ కూడా ప్రభాస్​తో 'సలార్' సినిమాను తెరకెక్కించే పనుల్లో బిజీ అయిపోయారు. దీంతో ఈ మూవీ గురించి ఎక్కడా కూడా ఊసే లేకుండా పోయింది.​​

అయితే తాజా సమాచారం ప్రకారం 2025లో 'కేజీఎఫ్-3'​ సినిమా రిలీజ్​ కానుందని హోంబలే ఫిల్మ్స్ సంస్థకు సంబంధించిన ఓ ప్రతినిధి తెలిపారు. ఈ ఏడాది చివరికల్లా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడక్షన్​ పనులు మొదలవుతాయని ఆయన అన్నారు. దీని గురించి అధికారిక ప్రకటనను ఈ ఏడాది డిసెంబర్ 21న చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్​ 2024 అక్టోబర్​లో జరగనుండగా.. 2025 కల్లా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నీల్​ మామ ప్లాన్​ అదుర్స్​.. 'సలార్​'తో రాకీ భాయ్ వార్​ !

Salaar KGF : కేజీఎఫ్​తో సలార్​కు నిజంగానే కనెక్షన్​ ఉందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.