ETV Bharat / entertainment

అజయ్‌ దేవ్‌గణ్​, టైగర్‌ ష్రాఫ్‌కు 'కేజీఎఫ్‌ 2' షాక్​ - కేజీఎఫ్ 2 రికార్డులు

'కేజీఎఫ్​ ఛాప్టర్‌ 2'.. సినీ ప్రియులందరి నోట ఇప్పుడిదే మాట వినిపిస్తోంది. కన్నడ పరిశ్రమలో రూపొందిన ఈ పాన్‌ ఇండియా చిత్రం అన్ని భాషల వారిని విశేషంగా ఆకట్టుకుంది. బాలీవుడ్‌ పెద్ద సినిమాలకు కూడా షాకులిస్తూనే ఉంది. రిలీజై మూడు వారాలు అవుతున్నా.. కలెక్షన్ల విషయంలో ఏమాత్రం జోరు తగ్గడం లేదు.

kgf 2 collections
kgf 2 collections
author img

By

Published : May 2, 2022, 10:06 PM IST

KGF 2 Hindi Box Office Collections: ఓవైపు అజయ్‌ దేవ్‌గణ్​, అమితాబ్‌ బచ్చన్‌.. మరోవైపు టైగర్‌ ష్రాఫ్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ.. ఇంతటి పెద్ద బాలీవుడ్‌ స్టార్ల సినిమాలను కూడా తలదన్నింది 'కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2'. 'రన్‌వే 34', 'హీరోపంతి 2' మూవీలు కలిపి ఆదివారం సాధించిన కలెక్షన్లను కూడా 'కేజీఎఫ్‌ 2' బీట్‌ చేసింది. ఈ సినిమాలు గత శుక్రవారమే రిలీజ్‌ కాగా.. కేజీఎఫ్‌ మాత్రం గత నెల 14న రిలీజైంది. ఓ కన్నడ మూవీ హిందీలో డబ్ అయ్యి సృష్టిస్తున్న ప్రభంజనానికి బాలీవుడ్‌ సినిమాలు అడ్రెస్‌ లేకుండా కొట్టుకుపోతున్నాయి.

బాక్సాఫీస్‌ ఇండియాలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. ఆదివారం 'హీరోపంతి 2' మూవీకి వచ్చిన కలెక్షన్లు రూ.4 కోట్లు మాత్రమే. వీకెండ్‌లో ఏ సినిమా అయినా తన కలెక్షన్లను పెంచుకుంటే ఈ సినిమా మాత్రం దారుణంగా బోల్తా పడింది. ఫస్ట్‌ వీకెండ్‌ మొత్తం కలిపి 'హీరోపంతి 2' వసూలు చేసిన మొత్తం రూ.15 కోట్లు. ఇక 'రన్‌వే 34' పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆదివారం ఈ సినిమా రూ.5.5 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ ఫస్ట్‌ వీకెండ్‌ కలెక్షన్లు కేవలం రూ.13 కోట్లు మాత్రమే. కానీ 'కేజీఎఫ్‌ 2' స్టోరీ మాత్రం మరోలా ఉంది. రిలీజైన తర్వాత మూడో ఆదివారం కూడా ఈ మూవీ కలెక్షన్ల జోరు తగ్గలేదు. ఈ సినిమా హిందీ వెర్షన్‌ ఆదివారం ఒక్కరోజే రూ.9.27 కోట్లు వసూలు చేసింది.

హిందీలో ఆదివారం వరకు 'కేజీఎఫ్‌ 2' మొత్తం రూ.369.58 కోట్ల కలెక్షన్లను సాధించింది. 'హీరోపంతి 2' తొలి వీకెండ్‌ కలెక్షన్లను బట్టి చూస్తే.. ఆ మూవీ రెండో వారం భారీగా థియేటర్లను కోల్పోనుంది. ఈ సినిమా స్థానంలో 'కేజీఎఫ్‌ 2'ను ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వచ్చే శుక్రవారం 'డాక్టర్‌ స్ట్రేంజ్‌ సీక్వెల్' రిలీజ్‌ కానుండటం వల్ల 'కేజీఎఫ్‌ 2' కలెక్షన్లు తగ్గే ఛాన్స్‌ ఉంది.

ఇదీ చదవండి: మళ్లీ మొదలైన ప్రభాస్​ 'ప్రాజెక్ట్​ కె' షూటింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.