ETV Bharat / entertainment

రంగస్థల నటుడు గూఢచారిగా.. 'సర్దార్‌'కు స్ఫూర్తి ఆ సంఘటనే

author img

By

Published : Oct 19, 2022, 10:00 AM IST

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తి. తాజాగా అతడు నటించిన సినిమా 'సర్దార్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు పంచుకున్నారు దర్శకుడు పీఎస్ మిత్రన్.

sardar director special interview
ps mithran special interview

'అభిమన్యుడు', 'హీరో' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్‌. ఈ రెండు సినిమాలతో కోలీవుడ్‌, టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ఆయన ఇప్పుడు 'సర్దార్‌'తో రాబోతున్నారు. కార్తి హీరోగా మిత్రన్‌ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మిత్రన్‌ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

'సర్దార్' ఎలా మొదలైంది?
మిత్రన్‌: నా తొలి చిత్రం 'అభిమన్యుడు' పోస్ట్‌ ప్రొడక్షన్‌ సమయంలో 'సర్దార్' కథాలోచన వచ్చింది. ఆ తర్వాత నా రచయితల్లోని ఒకరితో చర్చించి పూర్తి కథ డెవలప్ చేశా. నిర్మాత లక్ష్మణ్‌కు ఈ కథ చెబితే ఆయన కార్తిని కలవమన్నారు. నిర్మాత చెప్పినట్టే కార్తిని కలిసి, స్టోరీ వినిపించా. ఆయనకు బాగా నచ్చడంతో ఈ సినిమాలో నటించారు.

ఇది పీరియాడికల్‌ చిత్రమా?
మిత్రన్‌: అవును. వర్తమానం, 1980లో నడిచే కథ ఇది. 1980లో 'ఇండియన్ ఇంటెలిజెన్స్' బృందంలోని ఒకరిని గూఢచారిగా తయారు చేయాలని ప్రయత్నించింది. కానీ, అది సాధ్యపడలేదు. ఆ సైన్యంలో పని చేసే వ్యక్తి గూఢచారిగా మారాలంటే అతనికి నటించటం రావాలి, మారువేషాలు వేయటం తెలియాలి. అది ఎంతో కష్టం కాబట్టి రంగస్థల నటుడినే గూఢచారిగా మార్చారు. ఆ సంఘటన 'సర్దార్కు' ఓ స్ఫూర్తి. దాన్నుంచి ఈ కథను అల్లుకున్నా.

కార్తి ఎలా కనిపిస్తారు?
మిత్రన్‌: ఈ సినిమాలో కార్తి పోషించిన పాత్ర కొత్త అనుభూతి పంచుతుంది. తండ్రీకొడుకులుగా ఆయన నటన అద్భుతం. ఇందులోని ఓ పాత్ర.. తన గురించి ప్రపంచానికి తెలియకూడదనుకుంటుంది. మరో పాత్ర పబ్లిసిటీని కోరుకుంటుంది. విభిన్నమైన ఈ పాత్రల్లో కార్తి ఒదిగిపోయారు. ఆయన నటించిన 'పొన్నియిన్‌ సెల్వన్‌ 1' ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. దాన్ని 'సర్దార్‌' కొనసాగిస్తుందనే నమ్మకం ఉంది.

ఈ సినిమాలో వినోదం ఉంటుందా?
మిత్రన్‌: 'సర్దార్‌'లో యాక్షన్‌ మాత్రమే కాదు ప్రేమ, కామెడీ, ఎమోషన్‌.. ఇలా అన్ని అంశాలూ ఉన్నాయి. ఇది ఫుల్‌ మీల్స్‌లాంటి చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. రాశీ ఖన్నా, రజిషా విజయన్ పాత్రలు కథలో చాలా కీలకం. లైలా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

దీపావళి పోటీలో నిలవటం ఎలా అనిపిస్తుంది?
మిత్రన్‌: శివకార్తికేయన్‌ హీరోగా గతంలో నేను తెరకెక్కించిన 'హీరో'.. కార్తి సినిమాతో పోటీ పడింది. ఇప్పుడు కార్తి హీరోగా నేను తీసిన 'సర్దార్‌'.. శివకార్తికేయన్‌ 'ప్రిన్స్‌'తో కలిసి దీపావళి బరిలో నిలవటం విశేషం. ఈ సినిమాలేకాదు దీపావళి కానుకగా విడుదలయ్యే చిత్రాలన్నీ విజయవంతంకావాలని కోరుకుంటున్నా. మా సినిమా తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ విడుదల చేస్తుండటం ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన నిర్మాణ సంస్థ అది

తదుపరి సినిమా విశేషాలు?
మిత్రన్‌: అఖిల్‌తో ఓ సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ప్రస్తుతానికి నా దృష్టంతా 'సర్దార్' విడుదలపైనే ఉంది. ఇది రిలీజైన తర్వాత కొత్త సినిమాల పనులు మొదలుపెడతా.

ఇవీ చదవండి : విజయ్​ దేవరకొండ, శివ కార్తికేయన్​ మధ్య తేడా ఏంటో తెలుసా?

ఏంది ఈ అమ్మడు ధరించిన చీర అన్ని లక్షలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.