Karan Johar Kidnap: పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య, హీరో సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు, చంపేందుకు కుట్ర.. బాలీవుడ్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన సిద్ధేశ్ కాంబ్లే అలియాస్ మహాకాల్.. మరో సంచలన విషయాన్ని బయటపెట్టినట్లు తెలిసింది. తమ హిట్‌లిస్ట్‌లో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా ఉన్నట్లు చెప్పాడని ఓ పోలీస్ అధికారి తెలిపారు. కరణ్‌ను అపహరించి, బెదిరించి రూ.5కోట్లు డిమాండ్ చేయాలని మహాకాల్ ముఠా ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. అయితే ఇదంతా అతడు కావాలనే చెబుతున్నట్లు ఉందని సదరు అధికారి పేర్కొన్నారు.
కాగా, ఇటీవలే గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మూఠా.. సిద్ధూ మూసేవాలాను కాల్చి చంపిందన్న సమాచారంతో ఆ గ్యాంగ్‌కు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీమ్ ఖాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో సల్మాన్‌కు పోలీసులు భద్రత కూడా పెంచారు. ఇంతకుముందు కూడా 2018లో కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు చంపేస్తామన్నా బెదిరింపులు వచ్చాయి. వీటిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
ఇదీ చూడండి: సల్మాన్‌కు బెదిరింపులే కాదు.. హత్యకు కుట్ర.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..