ETV Bharat / entertainment

Kantara Prequel Shooting Location : స్క్రిప్టింగ్​ పూర్తి చేసుకున్న 'కాంతార ' ప్రీక్వెల్ ​.. షూటింగ్ అక్కడి నుంచే మొదలు.. - Kantara 2 Update

Kantara Prequel Shooting Location : కన్నడ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించిన 'కాంతార' సినిమా ఇప్పుడు ప్రీక్వెల్​గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్​ సోషల్​ మీడియాలో ట్రెండ్​ అవుతోంది. అదేంటంటే..

Kantara Prequel Shooting Location
కాంతార ప్రీక్వెల్​ షూటింగ్​ లొకేషన్​
author img

By

Published : Aug 21, 2023, 5:30 PM IST

Kantara Prequel Shooting Location : కన్నడ స్టార్​ హీరో రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన సూపర్​ హిట్​ మూవీ 'కాంతార' సినీ ఇండస్ట్రీలో ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలై పాన్​ ఇండియా లెవెల్​లో రూ.కోట్ల మేర కలెక్షన్లను అందుకుని దూసుకెళ్లింది. ఈ సినిమాతో రిషబ్​ శెట్టి క్రేజ్​ కూడా అమాంతం పెరిగిపోయింది. సినిమా స్టార్స్​ నుంచి ఆడియెన్స్​ వరకూ అందరూ ఆయనపై ప్రశంసల జల్లును కురిపించారు.

Kantara 2 Update : ఇక అందరి దృష్టి ఒక్కసారిగా కన్నడ ఇండస్ట్రీ వైపుకు మళ్లింది. అయితే అప్పట్లోనే 'కాంతార'కు రెండో భాగం ఉంటుందని రిషబ్ శెట్టి స్పష్టం చేశారు. అయితే అది సీక్వెల్​ కాదని ప్రీక్వెల్​ అంటూ క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇక అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్​ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అంటూ సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో ట్రెండ్​ అవుతోంది.

అదేంటంటే.. సినీ దర్శకుడు రిషబ్‌ శెట్టి తన టీమ్​తో కలిసి ప్రీక్వెల్‌ స్క్రిప్ట్‌ పనులను పూర్తి చేశారట. ఇందులో భాగంగా మొదటి పార్ట్​ షూటింగ్‌ను ఎక్కువ శాతం ఆయన సొంత ఊరు కుందాపురలో చేయగా.. ఇప్పుడు రెండో భాగాన్ని బెంగుళూర్‌లోని పలు ప్రాంతాల్లో చిత్రీకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Kantara 2 Shooting : మరోవైపు మొదటి భాగాన్ని తక్కువ బడ్జెట్‌తో ముగించగా.. ప్రీక్వెల్‌ను మాత్రం భారీ బడ్జెట్‌తో తీయనున్నారట. ఈ సారి సినిమాలో నటించే స్టార్స్​ ఎంపికలో కూడా మార్పులు చేయనున్నారని టాక్‌. అంతే కాకుండా మొత్తం షూటింగ్‌ను నాలుగు షెడ్యూళ్లలో పూర్తి చేయాలని మూవీ టీమ్ ప్లాన్​ చేస్తోందట. ఈ క్రమంలో సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో ముగించి.. చివర్లో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేయనున్నారట.

ఇక 'కాంతార' తొలిభాగం ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను ఈ ప్రీక్వెల్‌లో మేకర్స్​ చూపనున్నారు. ఇందులో పంజుర్లి దేవతకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయని సమాచారం. అంతే కాకుండా భూతకోల నేపథ్యాన్ని ఈ ప్రీక్వెల్​లో మరింత చూపనున్నారట. ఇక దర్శకుడు రిషబ్‌ శెట్టి ఈ సినిమా కోసం గుర్రపు స్వారీలో ప్రత్యేక శిక్షణ సైతం తీసుకున్నారని సమాచారం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'కాంతార' అభిమానుల​కు గుడ్​ న్యూస్​.. సినిమా మొదలయ్యేది అప్పుడే!

తెలుగులో దూసుకెళ్తోన్న 'కాంతార'.. 550కు పైగా థియేటర్లలో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.