ETV Bharat / entertainment

'కాంతార- చాప్టర్​1'​ బిగ్ అప్డేట్​- ఫస్ట్​లుక్ రిలీజ్ అప్పుడే! - kantara prequel

Kantara Chapter 1 First Look Release Date : సాధారణ చిత్రంగా విడుదలై సంచలనం సృష్టించింది కన్నడ సినిమా 'కంతార'. ఈ సినిమా ప్రిక్వెల్ నిర్మిస్తున్నట్లు చిత్ర యూనిట్​ ఇదివరకే ప్రకటిచింది. తాజాగా దానిపై ఓ బిగ్ అప్డేట్​ ఇచ్చింది. ఇంతకీ అదేంటంటే?

Kantara Chapter 1 First Look Release Date

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 3:22 PM IST

Updated : Nov 25, 2023, 3:48 PM IST

Kantara Chapter 1 First Look Release Date : గతేడాది సాధారణ సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం 'కాంతార'. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్​ను షేక్​ చేసింది. ఒక్కసారిగా పాన్​ ఇండియా సినిమాలకు ధీటుగా నిలిచింది. కన్నడ యాక్షన్​ థ్రిల్లర్​గా వచ్చిన ఈ చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​​, 'కేజీయఫ్'​ పాటు ఇతర విజయవంతమైన సినిమాల సరసన చేరింది. బాలీవుడ్​లోనూ సూపర్​ సక్సెస్​ను అందుకుంది. కన్నడ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన రెండో చిత్రంగానూ నిలిచింది. అయితే ఈ సినిమాకు ప్రిక్వెల్​ చేయనున్నట్లు నిర్మాతలు ఇది వరకే ప్రకటించారు.

Kantara Chapter 1 Update : 'కాంతార- చాప్ట‌ర్ 1' అనే టైటిల్​తో రానున్న ఈ మూవీకి కూడా రిషభ్​ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక ఈ సినిమా చిత్రీకరణను చిత్ర బృందం ఇటీవలే మొదలు పెట్టింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి బిగ్​ అప్డేట్​ను సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో షేర్​ చేసుకుంది చిత్ర నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్. 'కాంతార - చాప్టర్1' ఫస్ట్​ లుక్​ను నవంబర్ 27న మధ్యాహ్నం 12.25 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్​ చేసిన పోస్టర్​పై..'ఇది వెలుగు మాత్రమే కాదు.. దర్శనం' అని రాసుకొచ్చింది.

Kantara Chapter 1 Budget : కాంతార తొలి భాగాన్ని రూ.15 కోట్ల బడ్జెట్​లోనే రూపొందించారు. కానీ ఈ ప్రీక్వెల్ కోసం దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సినిమాకి గ్రాండ్ లుక్ తీసుకురావడంతో పాటు అన్ని భాషల్లో ఒకే సారి విడుదల చేసేలా చిత్ర సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విఎఫ్ఎక్స్​కు ఎక్కువ స్కోప్ ఉంటుందని అంటున్నారు. అందుకే ఈ సినిమా బడ్జెట్ రేంజ్ కూడా పెరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్​ వినిపిస్తోంది.

Kantara Chapter 1 Story : 'కాంతార' మొదటిభాగం ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను ఈ ప్రీక్వెల్‌లో మేకర్స్​ చూపనున్నారు. ఇందులో పంజుర్లి దేవతకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉండనున్నాయి. అంతే కాకుండా భూతకోల నేపథ్యాన్ని ఈ ప్రీక్వెల్​లో మరింత చూపనున్నారట. ఈ మేరకు దర్శకుడు రిషభ్ శెట్టి గతంలో ఓ ఇంటర్వ్యూలో 'కాంతార- చాప్టర్1'కు సంబంధించి కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు.

కుమార్తెకు బిగ్​బీ కాస్ట్​లీ గిఫ్ట్​ - విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే!

'తండేల్'​ టు 'తంగలాన్' ​- టైటిల్స్​లో కొత్త ట్రెండ్​ - వీటికి అర్థాలు తెలుసా ?

Last Updated : Nov 25, 2023, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.