Kangana Lock up show Actor Mandana abortion: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాలిటీ షో 'లాకప్'. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు తమ జీవితంలో జరిగిన, ఎవరికీ తెలియని షాకింగ్ సీక్రెట్లను బయటపెడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ షోలో పాల్గొన్న నటి మందానా కరిమి కూడా ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఓ డైరెక్టర్‌తో తాను సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నట్లు తెలిపింది.
"ఓ బడా డైరెక్టర్‌తో రహస్యంగా రిలేషన్షిప్లో ఉన్నాను. కొద్ది కాలంలోనే మేము బాగా దగ్గరైపోయాం. నా మాజీ భర్త నుంచి డివర్స్ వచ్చేవరకు దీన్ని సీక్రెట్‌గా ఉంచాలని అనుకున్నాం. ఈ క్రమంలోనే గర్భవతి అయ్యాను. ఈ విషయాన్ని అతనికి చెప్పాను. కానీ అతడు తండ్రి బాధ్యతలు తీసుకునేందుకు మానసికంగా సిద్ధంగా లేనట్లు తెలిపాడు. దీంతో నేను అబర్షన్ చేయించుకున్నాను." అని మందానా తెలిపింది. కాగా, మందానా 2017లో గౌరవ్ గుప్తా అనే బిజినెస్‌మ్యాన్‌ను వివాహమాడింది. కానీ పెళ్లి జరిగిన ఐదు నెలల్లోనే వీరు విడిపోయారు.
![Kangana Lock up show Actor Mandana abortion](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14986128_actor.jpg)
ఇదీ చూడండి: 'హరిహర వీరమల్లు' హైలైట్.. వెయ్యి మందితో పవన్‌కల్యాణ్ ఫైట్!