ETV Bharat / entertainment

ప్రభాస్ 'ప్రాజెక్ట్​ కె' స్టోరీ ఇదేనా?.. కమల్​ హాసన్ విలనేనా? - ప్రభాస్ ప్రాజెక్ట్​ కె స్టోరీ

kamal haasan project k : ప్రభాస్ 'ప్రాజెక్ట్​ కె' కథ ఇదేనంటూ ప్రచారం సాగుతోంది. కమల్​హాసన్​ పాత్ర గురించి కూడా చర్చ సాగుతోంది. ఆ వివరాలు..

Prabhas Project K
ప్రభాస్ 'ప్రాజెక్ట్​ కె' స్టోరీ ఇదేనటా!.. కమల్​ హాసన్ విలనేనా?
author img

By

Published : Jun 26, 2023, 9:22 PM IST

kamal haasan project k : ప్రభాస్‌-అమితాబ్‌ బచ్చన్‌-దీపిక పదుకొణె.. ఇలా భారీ తారాగణంతో ఇప్పటికే సినీ ప్రియుల అందరి దృష్టిని ఆకర్షించింది 'ప్రాజెక్ట్​ కె'. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్‌కు ఆదివారం మరో అదనపు ఆకర్షణ తోడైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో యూనివర్సల్​ స్టార్​ కమల్‌ హాసన్‌ భాగం కానున్నట్లు మూవీటీమ్ అధికారికంగా​ ప్రకటించింది. దీంతో సినీ అభిమానుల్లో ఫుల్​ జోష్​ నెలకొంది. అలాగే 'ప్రాజెక్ట్​ కె'పై అంచనాలు మరింత భారీగా పెరిగాయి.

ఇదే సమయంలో అగ్ర హీరోగా వెలుగొందుతున్న క‌మ‌ల్.. ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారన్న అనే ప్రశ్న అభిమానుల మదిలో తెగ మెదులుతోంది. ఈ క్రమంలోనే కమల్​ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లు జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఇప్పటికే ఆయన హీరోగా రీసెంట్​గా విక్రమ్​తో భారీ హిట్​ను అందుకున్న సంగతి తెలిసిందే. ఆయన కథానాయకుడిగా ప్రస్తుతం 'ఇండియన్ 2' భారీ సినిమా కూడా తెరకెక్కుతోంది. మరి ఇలాంటి సమయంలో ఆయన విలన్​గా కనిపిస్తారా అనే ప్రశ్న కూడా అభిమానుల మదిలో మెదులుతోంది.

project k cast and crew : ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ పాత్ర విషయానికొస్తే... ఆయన ప్రతినాయకుడిగా కనిపించే అవకాశం దాదాపుగా లేనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన పాత్ర అశ్వత్థామ తరహాలో ఉంటుందని మొదటి నుంచి అంటూనే ఉన్నారు. ఓ సైంటిస్ట్​లా, అలానే ప్ర‌భాస్‌ను వెన‌క నుంచి నడిపించే మెంటార్​లా ఉంటారని అంటున్నారు. ఇకపోతే దీపికా పదుకొణె.. అమితాబ్ బచ్చన్​ దగ్గర సహాయకురాలిగా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. అలాగే దిశా పటానీ ఓ కీలక పాత్ర అని కూడా చెబుతున్నారు. మరి ఈమె పాత్రలో ఏమైనా నెగటివ్ షేడ్స్​ ఉన్నాయా లేదా అనేది సస్పెన్సే. ఇక మిగిలి ఉందని ప్రతినాయకుడి పాత్ర ఎవరన్నది. కాబట్టి ఆ పాత్ర పోషించేది కమల్​ హాసన్​ అయి ఉండొచ్చని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే తాజా సమాచారం ఏంటంటే.. ఆయన కూడా ఓ సైంటిస్ట్​ పాత్రే పోషించబోతున్నారని ప్రచారం సాగుతోంది.

Project k story : 'ప్రాజెక్ట్​ కె' కథలో క‌మ‌ల్-అమితాబ్ క‌లిసి సైంటిస్టులుగా కనిపిస్తారట. అలా వీరిద్దరు కలిసి ఓ అద్భుతాన్ని ఆవిష్క‌రించాలని ప్రయత్నిస్తారట. అయితే దాన్ని మాన‌వాళి మంచికి ఉప‌యోగించాల‌న్న‌ది అమితాబ్ అనుకుంటే.. దాన్ని ప్ర‌పంచ‌ వినాశ‌నానికి, తన సొంత ప్రయోజనానికి ఉప‌యోగించాలని కమల్​ భావిస్తారట. అలా మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటంలో చెడుని ఆపేందుకు అమితాబ్​.. ప్రభాస్​ను ఓ అస్త్రంలా వినియోగిస్తారని టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రస్తుతానికి ఇలాంటి ప్రచారం సాగుతోంది.

ఫైనల్​గా కమల్​ పాత్ర విలన్​ అనేది నిజమైతే.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రను అయినా.. అందులోకి పరకాయ ప్రవేశం చేసి రక్తి కట్టిస్తారు. కాబ్టటి ఇక దర్శకుడు ఆయనకు సరైన ఎలివేష‌నే ఇస్తే అది వేరే లెవల్​లో ఉంటుందని అంతా అంటున్నారు. అలాగే కమల్​ లాంటి గొప్ప యాక్టర్​తో తలపడితే.. ప్ర‌భాస్ పాత్ర కూడా మరింత షైన్ అవుతుంద‌ని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఇదీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.