ETV Bharat / entertainment

'బింబిసార' - 'సీతారామం' ప్రీమియర్​ కలెక్షన్స్​ ఎంతంటే? - sitaramam review

కల్యాణ్​రామ్​ 'బింబిసార', దుల్కర్​ సల్మాన్​ 'సీతారామం' చిత్రం విడుదలైన మంచి రెస్పాన్స్​ను అందుకున్నాయి. అయితే ఈ చిత్ర ప్రీమియర్ కలెక్షన్స్ ఎంతంటే?

సీతారామం కలెక్షన్స్​
బింబిసార కలెక్షన్స్​
author img

By

Published : Aug 5, 2022, 10:19 AM IST

వేసవి సినిమాల సందడి తర్వాత జులై నెల పూర్తిగా నిరాశపరిచింది. గత నెలలో విడుదలైన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుడిని పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో ఆశలన్నీ ఆగస్టుపైనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆగస్టు మొదటి వారంలో(నేడు) ప్రేక్షకులు ముందుకు వచ్చిన కల్యాణ్​రామ్​ 'బింబిసార', దుల్కర్​ సల్మాన్​ 'సీతారామం' చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రీమియర్​ షోలకు మంచి రెస్పాన్స్​ వచ్చింది. రెండు కూడా పాజిటివ్​ టాక్​ తెచ్చుకున్నాయి.

బింబిసార విషయానికొస్తే.. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా.. నందమూరి కల్యాణ్‌రామ్‌ నటించిన సోషియో ఫాంటసీ అండ్​ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఆయన కెరీర్​లోనే భారీ స్థాయిలో రూపొందింది. అయితే ఈ చిత్రం యూఎస్​ఏ ప్రీమియర్​ కలెక్షన్స్​ వివరాలు బయటకు వచ్చాయి. ఓ సినిమా వెబ్​సైట్​ కథనం ప్రకారం.. 99 లొకేషన్స్​లో విడుదలైన ఈ చిత్రానికి 35,195 డాలర్స్​ అంటే దాదాపు 27లక్షల 85వేల వరకు వచ్చాయని తెలిసింది.

ఇక సీతారామం విషయానికొస్తే... మలయాళ స్టార్ దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. 'యుద్ధంతో రాసిన ప్రేమ కథ ఉపశీర్షిక. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. అశ్వినీదత్‌ నిర్మాత. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కూడా ఫీల్​గుడ్​ మూవీగా ప్రేక్షకుల్ని హత్తుకుంది.అయితే ఈ చిత్ర యూఎస్​ఏ ప్రీమియర్​ కలెక్షన్స్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. దాదాపు 182 లొకేషన్స్​లో విడుదలై ఈ చిత్రం ​ 43 లక్షల 23 వేల వరకు కలెక్ట్ చేసినట్లు సమాచారం.

ఇదీ చూడండి: కమల్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. మళ్లీ సెట్స్​పైకి భారతీయుడు-2.. RC15 షూట్​కు బ్రేక్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.