ETV Bharat / entertainment

సినిమాల్లోకి జూనియర్​ ఎన్టీఆర్ పెద్ద కొడుకు.. సితార పాపతో కలిసి.. నిజమేనా? - అక్కాతమ్ముళ్లుగా అభయ్​ రామ్ సితార

junior ntr mahesh babu : యంగ్ టైగర్​ ఎన్టీఆర్​ - సూపర్ స్టార్​ మహేశ్​బాబు ఫ్యాన్స్​లో ఊపు తెప్పించే వార్త ఒకటి సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తారక్ పెద్ద కుమారుడు అభయ్ రామ్​ సినిమాల్లోకి చైల్డ్ ఆర్టిస్ట్​గా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలిసింది. అది కూడా మహేశ్ కూతురు సితారతో కలిసి నటించబోతున్నాడంటా. ఆ వివరాలు..

Mahesh ntr
ఊహించని సర్​ప్రైజ్​.. సినిమాల్లోకి ఎన్టీఆర్ పెద్ద కొడుకు.. అది కూడా సితారతో కలిసి!
author img

By

Published : Jul 15, 2023, 11:10 AM IST

junior ntr mahesh babu : చిత్రసీమలో హీరోల మధ్య ఉండే అనుబంధం, స్నేహబంధం గురించి తెలిసిందే. అప్పటి ఎన్టీఆర్​-ఏఎన్నార్‌-కృష్ణ నుంచి ఇప్పటి ఎన్టీఆర్- రామ్​చరణ్​-మహేశ్​బాబు​ వరకు అందరూ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరి సినిమా ఈవెంట్లకు మరొకరు హాజరై అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటారు. అయితే ఇప్పుడా అనుబంధాన్ని ఇప్పటి తరం పిల్లలు కూడా కొనసాగించబోతున్నట్లు అర్థమవుతోంది.

jr ntr big son name : ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్​ ఒకరి తర్వాత మరొకరు ఎంట్రీ ఇస్తున్నారు. రవితేజ, సుధీర్​బాబు, మహేశ్ బాబు అల్లు అర్జున్​ సహా ఇతర కథానాయకుల పిల్లలు చిత్రాల్లో నటించారు. రాజా ది గ్రేట్​లో రవితేజ కొడుకు, విన్నర్​, భలే భలే మగాడివోయ్​లో సుధీర్​ బాబు కొడుకు, అల్లుఅర్జున్ కూతురు శాకుంతంలో, మహేశ్ బాబు కూతురు సర్కారు వారి పాటలో కనిపించి అలరించారు. అయితే ఇప్పుడు జూనియర్​ ఎన్టీఆర్​ పెద్ద కొడుకు అభయ్ రామ్ కూడా సినిమాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Mahesh babu daughter sitara : అది కూడా మహేశ్ బాబు కూతురు సితారతో కలిసి తెరను షేర్ చేసుకోనున్నాడని అంతా అంటున్నారు. ప్రస్తుతం దీని గురించి బయట కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఏ సినిమాలో అంటే.. దిగ్జజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించబోయే కొత్త సినిమాతో అభయ్​ రామ్​ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. ప్రస్తుతం జక్కన్న మహేశ్​బాబుతో కలిసి ఓ భారీ అడ్వెంచర్ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్​ జోరుగా కొనసాగుతున్నాయి. ఈ చిత్రంలో ఇంట్రడక్షన్ సీన్ దాదాపు 20 నిమిషాల పాటు ఉండనుందని తెలిసింది.

ఇందులో మహేశ్ కూతురు సితార -ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్​ను అక్కాతమ్ముళ్లుగా చూపించనున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. తారక్​ కొడుకు మొదటిసారి సిల్వర్​ స్క్రీన్​పై కనిపించినట్టువుతుంది. ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఇప్పటికే మహేశ్ కూతురు.. మల్టీటాలెంటెడ్​గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన మాటలతో అందర్నీ ఆకట్టుకుంటుంది. డ్యాన్స్​ కూడా చాలా బాగా వేస్తుంది. సోషల్​మీడియాలోనూ మంచి ఫాలోయింగ్​ను సంపాదించుకుంది. రీల్స్​, డ్యాన్స్​ చేస్తూ సందడి చేస్తుంది. ఇటీవలే ఓ ఇంటర్నేషనల్​ జ్యూవెలరీకి బ్రాండ్ అంబాసిడర్​గా ఎంపికైంది. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్​ బిల్​ బోర్డుపై ఆమె ఫొటోలు కూడా ప్రదర్శితమయ్యాయి. మహేశ్ నటించిన 'సర్కారు వారి పాట' చిత్రంలోని పెన్ని సాంగ్​లో తండ్రితో కలిసి చిందులేసింది.

ఇదీ చూడండి :

అదీ సితార పాప రేంజ్.. ఏకంగా న్యూయార్క్​ టైమ్స్​​ స్క్వేర్ ​బిల్​బోర్డ్​పై..

సారంగదరియా సాంగ్‌కు 'సితార పాప' డ్యాన్స్.. దుమ్ము దులిపేసిందిగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.