భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు రాజమౌళి. ఆయన రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' మూవీతో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తన పాన్ ఇండియా ఇమేజ్‌కు తగ్గట్లుగా కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ప్రారంభమైన NTR30 షూటింగ్ ఆలస్యమయ్యేందుకు కూడా స్క్రిప్ట్ వర్క్ కారణమనేది టాక్. ఈ మూవీ తర్వాత తారక్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31కు సైన్ చేశారు. అయితే అంతకన్నా ముందే బాలీవుడ్‌లోకి తారక్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'వార్'కు సీక్వెల్‌గా తెరకెక్కనున్న 'వార్2' చిత్రంలో హృతిక్ రోషన్‌తో కలిసి నటించబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తారక్, హృతిక్ కాంబినేషన్‌లో అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్న ఈ 'వార్2' మూవీ షూటింగ్ నవంబర్‌లో ప్రారంభమవుతుందట. భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి ఈ ప్రాజెక్ట్‌ను గ్లోబల్ సినిమాటిక్ మూమెంట్‌గా మార్చాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట.
అయితే నవంబర్‌లో షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించే అవకాశం ఉండటంతో ప్రీ-ప్రొడక్షన్ వర్క్‌ను ఫుల్ స్వింగ్‌లో కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్లు టాక్. ఈ విధంగా YRF స్పై యూనివర్స్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఇక ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు ఆనందంతో గెంతులేస్తున్నారు.
మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న 'NTR30' సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. అంతకుముందు అదే సెట్స్‌లోకి ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ ఎంట్రీ ఇస్తున్న వీడియో ఒకటి మూవీ టీమ్ రిలీజ్ చేయగా.. అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ ఏడాదంతా ఎన్టీఆర్.. ఇదే మూవీ షూటింగ్‌లో గడిపే అవకాశం ఉందని టాక్. ఈ గ్యాప్‌లోనే నవంబర్‌లో తన పోర్షన్ వరకు 'వార్2' షూటింగ్‌లో పాల్గొనవచ్చని తెలుస్తోంది.
NTR30 విషయానికొస్తే.. తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్నారు. సాబు సిరిల్ ఆర్ట్ డైరెక్టర్‌గా, రత్నవేలు డీవోపీగా పనిచేస్తున్న చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు.