ETV Bharat / entertainment

Jigarthanda Double X Teaser : ఊరమాస్​గా​ జిగర్తాండ డబుల్‌ X టీజర్​.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే? - రాఘవ లారెన్స్‌ జిగర్తాండ డబుల్‌ X టీజర్

Jigarthanda Double X Teaser : రాఘవ లారెన్స్‌, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్తాండ డబుల్‌ఎక్స్‌' టీజర్ రిలీజై ఆకట్టుకుంది. లారెన్స్-ఎస్​ జే సూర్య లుక్స్​, యాక్టింగ్​ మంచి ఇంట్రెస్టింగ్​గా ఉంది. మీరూ చూసేయండి..

Jigarthanda Double X Teaser
జిగర్తాండ డబుల్‌ఎక్స్‌ టీజర్​
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 3:20 PM IST

Updated : Sep 11, 2023, 3:44 PM IST

Jigarthanda Double X Teaser : రాఘవ లారెన్స్‌, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'జిగర్తాండ డబుల్‌ఎక్స్‌'. 8 ఏళ్ల కిందట రిలీజై ఘన విజయం సాధించిన 'జిగర్తాండ' సినిమాకు సీక్వెల్​గా రాబోతుంది. తాజాగా ఈ మూవీ టీజర్​ రిలీజై మంచి ఇంట్రెస్ట్​ను క్రియేట్ చేస్తోంది. సౌత్ ఇండియా స్టార్స్​ హీరోలు మహేశ్​ బాబు, ధనుశ్​, దుల్కర్ సల్మాన్, రక్షిత్ శెట్టి.. వారి భాషల్లో టీజర్​ను విడుదల చేశారు. ఈ వీడియో గ్లింప్స్​లో లారెన్స్‌ గన్స్‌ పట్టుకుని, బీడీ తాగుతూ పక్కా మాస్‌ లుక్​లో ఆకట్టుకోగా.. ఎస్‌జే సూర్య సూట్‌ వేసుకుని స్టైల్‌గా కెమెరా పట్టుకుని కనిపించారు.

ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. దర్శకుడు అవ్వాలనుకున్న ఓ వ్యక్తి, గ్యాంగ్‌స్టర్ చుట్టూ నడిచే కథ ఇది. ఓ సరైన రియల్​ లైఫ్​ క్రైమ్ కథ కోసం వెతికే ఓ డైరెక్టర్​కు.. ఓ రియల్ లైఫ్ రౌడీ తన బయోపిక్​నే సినిమాగా తీయాలని చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. అదే ఈ జిగర్తాడం డబుల్ ఎక్స్.

ఈ టీజర్​లో దర్శకుడి పాత్రను ఎస్‌జే సూర్య పోషించగా.. గ్యాంగ్‌స్టర్​గా రాఘవ లారెన్స్ కనిపించారు. 1970 బ్యాక్​డ్రాప్​లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. టీజర్​లో ఆ వాతావరణాన్ని బాగా క్రియేట్ చేశారు. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​, ​లారెన్స్​, ఎస్​జే సూర్య లుక్స్​, యాక్టింగ్ అన్నీ సినిమాపై మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి.

ఇకపోతే ఈ చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్​. అయితే పాన్ ఇండియాగా కాకుండా.. పాండ్యా వెస్టర్న్​గా రాబోతున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని వీడియో గ్లింప్స్​లో చూపించారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు కథ, దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తన సొంత బ్యానర్ స్టోన్ బెంచ్ ఫిల్మ్స్​పై చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. తిరు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. షూటింగ్​ కూడా ఇప్పటికే పూర్తైపోయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Jawan Day 4 Collection : భారత్-పాక్ మ్యాచ్​ రోజూ తగ్గని 'జవాన్' వసూళ్లు.. నాలుగు రోజుల్లో రూ.500కోట్లు

Trisha Latest photoshoot : ఏముంది భయ్యా త్రిష.. ఆ అందాన్ని ఎవరూ మ్యాచ్​ చేయలేరేమో!

Last Updated : Sep 11, 2023, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.