'జాతిరత్నాలు', 'ప్రిన్స్' చిత్రాలతో ప్రేక్షకులకు తన కామెడీ టైమింగ్‌ను రుచి చూపించిన దర్శకుడు అనుదీప్. 'ప్రిన్స్' విజయంపై ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన సినిమాల్లోని కామెడీ టైమింగ్‌కు ప్రశంసలే కాకుండా.. విమర్శలూ వచ్చాయన్నారు. కొంతమంది చెత్త కామెడీ అంటూ కామెంట్లు చేశారని తెలిపారు.
''ప్రశంసలే కాదు.. నాపై చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. కొంతమంది నాది చెత్త కామెడీ అంటూ కామెంట్లు చేశారు. వాళ్లందరికీ చెప్పేది ఒక్కటే.. చార్లీచాప్లిన్‌కు ఉన్నంత తెలివి నాకు లేదు. నాకున్న తెలివి, కామెడీ టైమింగ్‌కు అనుగుణంగా ఎవర్ని బాధపెట్టకుండా కుటుంబం మొత్తం కలిసి నవ్వుకునేలా సినిమాల్లో హాస్యాన్ని పండిస్తున్నా. నా కామెడీ కొంతమందికి నచ్చవచ్చు... నచ్చకపోవచ్చు. నచ్చకపోతే విమర్శించండి. తప్పులేదు. ఎందుకంటే నేను విమర్శలను స్వాగతిస్తా. అయితే, విమర్శలు ఎప్పుడూ వివరణాత్మకంగా ఉండాలి. నా సినిమాల్లోని ఏ సీన్‌లో మీకు కామెడీ నచ్చలేదో చెబితే మరింత మెరుగుపరుచుకుంటా. ఇక, కొంతమంది అయితే 'జాతిరత్నాలు' లక్కీగా హిట్ అయ్యిందన్నారు. అలా, ఎందుకు అంటున్నారో నాక్కూడా చెప్పండి. రెండేళ్లపాటు మేము కష్టపడి ఆ సినిమా చేశాం'' అని అనుదీప్ వివరించారు. అనంతరం ఆయన.. నటీనటులపై సోషల్‌మీడియాలో వచ్చే ట్రోలింగ్ చూస్తే షాకింగ్‌గా ఉంటుందన్నారు.
ఇదీ చూడండి: ఆ విషయంలో వంటలక్క ప్రతిరోజు ఏడుస్తూనే ఉంటుందట