Janhvi Kapoor Latest Interview : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం అటు హిందీతో పాటు ఇటు 'దేవర' సినిమా షూటింగుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఆమె 'కాఫీ విత్ కరణ్' షో 8వ సీజన్లో సందడి చేసింది. తన సోదరి ఖుషీ కపూర్‌తో కలిసి హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అయితే అందులో 'ఎప్పుడైనా మీకు రొమాంటిక్ మెసేజ్‌లు వచ్చాయా?' అని కరణ్ అడగ్గా 'దీనికి సమాధానం చెబితే ఖుషీ నన్ను ఏడిపిస్తుంది' అంటూ జాన్వీ సరదాగా బదులిచ్చింది.
మరోవైపు 'ఎవరితో డేటింగ్ చేస్తారు ?' అంటూ ఇంకో ప్రశ్న అడిగితే దానికి 'సినిమా వాళ్లతో మాత్రం చేయను. డేటింగ్ చేసేవాళ్లకు నేనే లోకమైపోవాలి. ప్రతి మూమెంట్‌ను ఎంజాయ్ చేయాలి. సినీ రంగంలో చాలా స్ట్రెస్ ఉంటుంది. ఒకే వృత్తిలో ఉండేవాళ్లు దాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం' అని జాన్వీ తన అభిప్రాయాన్ని తెలియజేసింది.
మరోవైపు రష్మిక డీఫ్ ఫేక్‌పై జాన్వీ కపూర్ తాజాగా స్పందించింది. 'ఇలా చెప్పడం వింతగా అనిపిస్తోంది. ఎందుకంటే నేను ఏది చెప్పినా, ఏం మాట్లాడినా కూడా ప్రతి ఒక్కరూ నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ మూలాల గురించి మాట్లాడతారు. అందుకే నేనెప్పుడూ అప్రమత్తంగానే ఉండేదాన్ని. నాకేం కావాలో, ఏం వద్దో ఎప్పుడూ బహిరంగంగా నా అభిప్రాయాలను వెల్లడించలేదు. డీప్ ఫేకర్స్, ఫొటోలను మార్ఫింగ్ చేసేవారి గురించి మాట్లాడానికి కూడా నాకు హక్కు లేదు. ఈ విషయంలో నేనేమీ చెప్పలేను. కానీ, అలాంటి వారిని ఎదిరిస్తూ రష్మిక నిలబడిన తీరును మాత్రం ప్రశంసిస్తాను. యుక్తవయసులోనే నా మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను చూశాను. ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి నేను అలా చేస్తున్నానంటూ అనుకుంటారేమోనని నేను భయపడ్డాను' అంటూ జాన్వీ కపూర్ తెలియజేసింది.
Janhvi Kapoor Movies : ఇక జాన్వీ లైనప్ విషయానికొస్తే బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటోన్న జాన్వీ 'దేవర'తో టాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నారు. కొరటాల శివ డైరెక్షన్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న చిత్రమిది. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. దీని గ్లింప్స్ జనవరి 8న విడుదల చేయనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'అమ్మ మరణం- ఏడ్చుకుంటూ చెల్లి గదిలోకి వెళ్లా- కాసేపటికే!'
''దేవర' సెట్లోకి వెళితే సొంతింటికి వచ్చినట్లు అనిపిస్తోంది- కారణం అదేనేమో!'