Avatar 2 Movie Trailer: ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అవతార్ సీక్వెల్ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ట్రైలర్ బుధవారం సాయంత్రం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో విడుదల అయింది. డిసెంబర్ 16వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ ట్రైలర్‌లో కథను పెద్దగా రివీల్ చేయలేదు. అయితే పండోరా గ్రహం మీద ఉన్న కొత్త ప్రాంతాలను, జీవులను ఈ ట్రైలర్‌లో చూపించారు. ముఖ్యంగా నీటిలో ఉన్న జీవుల విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కొత్త పాత్రలను కూడా ఈ ట్రైలర్‌లో చూడవచ్చు. మొదటి భాగం చివర్లో భూమికి చెందిన మనుషులను తిరిగి వెనక్కి పంపేసినట్లు చూపించారు. అయితే వారు మళ్లీ తిరిగి వచ్చినట్లు ఈ ట్రైలర్‌లో తెలుస్తోంది. పండోరా గ్రహంలో నీటిలో ఉండే వారికి, భూమి నుంచి వచ్చిన వారికి, మొదటి భాగంలో చూపించిన పండోరా వాసులకు మధ్య యుద్ధం జరుగుతున్న విజువల్స్ కూడా ట్రైలర్‌లో చూడవచ్చు.
-
On December 16, return to Pandora.
— 20th Century Studios (@20thcentury) November 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. pic.twitter.com/U2iztiq2Nh
">On December 16, return to Pandora.
— 20th Century Studios (@20thcentury) November 2, 2022
Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. pic.twitter.com/U2iztiq2NhOn December 16, return to Pandora.
— 20th Century Studios (@20thcentury) November 2, 2022
Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. pic.twitter.com/U2iztiq2Nh
ఈ సినిమా నిడివి 3 గంటల 10 నిమిషాలు ఉండనుందని సమాచారం. అవతార్‌కు సంబంధించి మొత్తం నాలుగు భాగాలు ఒకేసారి తెరకెక్కినట్లు తెలుస్తోంది. అవతార్ 3 2024లో, అవతార్ 4 2026లో, అవతార్ 5 2028లో విడుదల కానున్నాయి. ప్రస్తుతం అవతార్ 3 పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అవతార్ 4, 5ల షూటింగ్ కూడా ఎప్పుడో అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఏకంగా 160 భాషల్లో అవతార్ 2 విడుదల కానుంది.
కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులు రూ.100 కోట్ల వరకు పలుకుతున్నాయని టాక్. పెద్ద హీరోల సినిమాలకు తప్ప మిగతా తెలుగు హీరోల సినిమాల హక్కులు అందులో సగం కూడా పలకవు. పెద్ద హీరోల సినిమాలు కూడా సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప ఆ వసూళ్లు దాదాపు అసాధ్యం. దీన్ని బట్టి అవతార్ క్రేజ్ ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు.