Jailer Hukum Spotify : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన సినిమా 'జైలర్'. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు. యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ కథకు, అనిరుధ్ సంగీతం తోడవడం వల్ల థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇప్పటికే అనేక రికార్డులు బ్రేక్ చేస్తున్న ఈ సినిమా.. తాజాగా మరో ఘనత సాధించింది. అదేంటంటే.
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. ఎప్పటిలాగే ఈ సినిమాలో తన సంగీతం మార్క్‌ను చూపించారు. ఒక్కో సీన్లో అనిరుధ్.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో థియేటర్లలో ఆడియెన్స్‌కు గూస్బంప్స్ తెప్పించారు. అయితే సినిమాలోని 'హుకుమ్' పాట రీసెంట్గా ఓ అరుదైన ఘనత సాధించింది. ప్రముఖ పోడ్కాస్ట్ 'స్పాటిఫై'లో నెం.1 స్థానాన్ని దక్కించుకుంది. దక్షిణ భారతంలో ఈ మైలురాయి అందుకున్న ఏకైక పాట ఇదేనంటూ 'జైలర్' నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ట్విట్టర్లో తెలిపింది.
Rajinikanth Meets Yogi Adityanath : సూపర్ స్టార్ రజనీ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లారు. అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి.. శనివారం లఖ్‌నవూలో 'జైలర్' స్పెషల్ షో వీక్షించనున్నారు. అంతకుముందు రజనీ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ రాష్ట్ర గవర్నర్ ఆనందీ బెన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఆదివారం రజనీకాంత్ అయోధ్య వెళ్లనున్నారు.
Jailer Corldwide Collection : ఇక సినిమా విషయానికొస్తే.. ఆగస్టు 10 న జైలర్ గ్రాండ్‌గా విడుదలై.. ఇప్పటికీ హౌస్‌ఫుల్ షోస్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్ల పరంగా రజనీ కెరీర్లో 'జైలర్' అతిపెద్ద సినిమా. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా.. తొమ్మిది రోజుల్లో రూ. 450 కోట్లు వసూలు చేసింది.
Jailer Cast : ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, మలయాళ నటుడు మోహన్‌లాల్ కీలక పాత్రల్లో నటించారు. సీనియర్ నటి రమ్యకృష్ణ.. రజనీ భార్య పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. తమన్నా, కమెడియన్ సునీల్ తదితరులు ఆయా పాత్రల్లో నటించి మెప్పించారు. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
-
Hukum Tiger-ka Hukum🔥 Tiger Muthuvel Pandian is on duty! Ellarum kapchip-nu irukkanum 😎#Jailer ruling the theatres all around the world💥#JailerRecordMakingBO@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks… pic.twitter.com/Ugx4jiFUaZ
— Sun Pictures (@sunpictures) August 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hukum Tiger-ka Hukum🔥 Tiger Muthuvel Pandian is on duty! Ellarum kapchip-nu irukkanum 😎#Jailer ruling the theatres all around the world💥#JailerRecordMakingBO@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks… pic.twitter.com/Ugx4jiFUaZ
— Sun Pictures (@sunpictures) August 18, 2023Hukum Tiger-ka Hukum🔥 Tiger Muthuvel Pandian is on duty! Ellarum kapchip-nu irukkanum 😎#Jailer ruling the theatres all around the world💥#JailerRecordMakingBO@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks… pic.twitter.com/Ugx4jiFUaZ
— Sun Pictures (@sunpictures) August 18, 2023
-
Actor Rajinikanth calls on Uttar Pradesh Governor Anandiben Patel in Lucknow
— ANI (@ANI) August 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Photo source: Raj Bhawan) pic.twitter.com/L349znCusD
">Actor Rajinikanth calls on Uttar Pradesh Governor Anandiben Patel in Lucknow
— ANI (@ANI) August 19, 2023
(Photo source: Raj Bhawan) pic.twitter.com/L349znCusDActor Rajinikanth calls on Uttar Pradesh Governor Anandiben Patel in Lucknow
— ANI (@ANI) August 19, 2023
(Photo source: Raj Bhawan) pic.twitter.com/L349znCusD
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Jailer Day 4 Collection : రజనీ 'జైలర్' కలెక్షన్ల సునామీ.. రూ.150 కోట్లకు చేరువలో..