Rajinikanth Jailer collections : సూపర్ స్టార్ రజినీ కాంత్ 'జైలర్' బాక్సాఫీస్ వద్ద అస్సలు స్లో మూడ్‌లో నడిచే పరిస్థితే కనపడట్లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వద్ద హవాను ఇంకా కొనసాగిస్తోంది. రిలీజై పది రోజులైనా వసూళ్లను అందుకుంటూనే ఉంది. సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 514.25కోట్లను అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Jailer Worldwide Collections : మొదటి వారంలో రూ.450.80కోట్లను అందుకోగా.. రెండో వారంలో తొలి రోజు 19.37కోట్లు, రెండో రోజు 17.22 కోట్లు, మూడో రోజు 23.86కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తంగా రూ. 514.25కోట్లను అందుకుంది. అయితే ఇప్పటికే రూ.400కోట్లను అందుకుని.. యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ 'విక్రమ్' లైఫ్ టైమ్ వసూళ్లను బ్రేక్ చేసిన జైలర్.. ఇప్పుడు రూ.500కోట్లతో పొన్నియిన్ సెల్వన్ లైఫ్ టైమ్ గ్రాస్ కలెక్షన్లను అధిగమించింది. కోలీవుడ్‌లో అత్యంత వేగంగా ఈ రూ.500కోట్ల మార్క్‌ను అందుకున్న రెండో చిత్రంగా నిలిచింది. అంతకుముందు రజనీ నటించిన 'రోజో 2.0' ఈ ఫీట్‌ను అందుకుని అగ్రస్థానంలో నిలిచింది.
Jailer Cast : ఇకపోతే ఈ చిత్రాన్ని దళపతి విజయ్ 'బీస్ట్' ఫేమ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు(Jailer movie director). కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీష్రాఫ్, సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. తమన్నా ఓ స్పెషల్ రోల్‌తో పాటు సాంగ్లోను మెరిసింది. టాలీవుడ్ కెమెడియన్ అండ్ విలక్షన్ నటుడు సునీల్.. అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. ఇక అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్.. రజనీకాంత్‌ను బాగా ఎలివేచ్ చేసి హైలైట్‌గా నిలిచింది. ఒక్కో సీన్లో ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో థియేటర్లలో ఆడియెన్స్‌కు గూస్బంప్స్ వచ్చాయి.